ఏపీ ప్రభుత్వానికి షాక్-దమ్మాలపాటిపై కేసు కొట్టివేత : ఇన్‍సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో..!!
అమరావతి భూముల వ్యవహారంలో మరో కీలక కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటుగా బంధువుల పైన ఏపీ ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసు నమోదు చేసిన సమయం నుంచి అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి.
తాజాగా, దమ్మాలపాటి తో పాటుగా ఇతరుల పైన నమోదు చేసిన ఇన్‍సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఈ కేసులో హైకోర్టు స్టే ఇవ్వటంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును అశ్రయించింది. అయితే, సుప్రీం కోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంలో ఇచ్చిన తీర్పుతో..ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో తన పిటీషన్ ను విత్ డ్రా చేసుకుంది. అదే సమయంలో ఈ కేసును నెల రోజుల్లో తేల్చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

దీనికి సంబంధించి జస్టిస్ మానవేంద్రనాథ్‍రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై కేసులను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటుగా...ఈ కేసులకు సంబంధించిన ఎఫ్‍ఐఆర్‍ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచీ అమరావతి భూముల్లో నాటి ప్రభుత్వం ఆన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని ఆరోపిస్తూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో జరిగిన భూ కుంభకోణం పైన మంత్రుల కమిటితో పాటుగా విచారణ కమిటీని నియమించింది. నాటి ప్రభుత్వంలో పలువురు మంత్రులు..టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ శాసనసభలో ఆర్దిక మంత్రి బుగ్గన పేర్లను బయట పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం పైన విచారణకు సైతం ఆదేశించింది.
అయితే, కోర్టులో మాత్రం ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి కేసులు నిలబడలేదు. ఇప్పుడు తాజాగా దమ్మాలపాటి శ్రీనివాస్ పైన నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సైతం రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వటంతో.. ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం పైన ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications