హైదరాబాద్ అందరిదీ, విడిపోయినా కలిసుందాం: శీలం

అలాంటి హైదరాబాదు అందరిదీ అన్నారు. హైదరాబాదు ఏ ఒక్కరిదీ కాదన్నారు. సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలను తాము మొయిలీ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారని, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని తమకు సూచించారన్నారు. రాజధాని, నీళ్లు, నిధులను ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నానన్నారు.
క్లిష్టమైన సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోతే ప్రజలకు తాము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందన్నారు. తాము సీమాంధ్రకు ప్యాకేజీ పైన చర్చించలేదన్నారు. ప్రజలకు సమాధానం ఇవ్వలేని పరిస్థితి సీమాంధ్రలో ఉందన్నారు. చమురు, సహజవాయు కేటాయింపులపై చర్చించినట్లు చెప్పారు. ఇరు ప్రాంతాలకు, తెలుగు ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరామన్నారు.
తెలంగాణ ప్రజలకు ఇంత బాధ ఎందుకు ఉందో నాయకులను కూర్చో బెట్టుకొని మాట్లాడుకుందామనే ఆలోచన చేస్తున్నామన్నారు. సీమాంధ్ర ప్రజలు హైదరాబాదును తమ నగరంగా భావించారని అభిప్రాయపడ్డారు. అందుకే సీమాంధ్రలో 12 నియోజకవర్గాలు తగ్గి హైదరాబాదు పరిసరాల్లో పెరిగాయన్నారు. హెచ్ఎండియే ప్రాంతం అందరిదని చెప్పామన్నారు. తాము కొత్త ప్రతిపాదనలేవీ మొయిలీ ముందు పెట్టలేదన్నారు.
ప్రతి ఒక్క విద్యార్థికి హైదరాబాద్ అనేది ఓ కల అన్నారు. మంత్రులమంతా ఒకే అభిప్రాయంతో ఉన్నామని చెప్పారు. అవసరమైతే ప్రాంతాలుగా విడిపోయి తెలుగు ప్రజలుగా కలిసుందామని చెప్పారు. హైదరాబాదులో ఎనిమిది ఏళ్లలో 55వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. హైదరాబాదుతో పోటీగా రాష్ట్రంలో మరెక్కడా అభివృద్ధి జరగలేదన్నారు.












Click it and Unblock the Notifications