హైదరాబాదులో దారుణం: సోదరిని చంపిన వ్యక్తి

మృతురాలు రెహానా బేగం తన పాపతో పాటు పుట్టింటిలో ఉంటోంది. తన భర్త షేక్ హజీ అలీ కొన్ని నెలల క్రితం కడపకు వెళ్లాడు. దీంతో ఆమె తన తల్లిదండ్రులతో ఉంటోంది. రెహానా సోదరుడు సలీంకు తన సోదరి తమ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. దీంతో శుక్రవారం రాత్రి సోదరితో గొడవ పడ్డాడు.
తీవ్రమైన గొడవలో సలీలం రెహానా ఛాతీపై తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, శనివారం రాత్రి ఆమె మరణించింది. రెహానా మరో సోదరుడు రషీద్ పోలీసులకు సోమవారంనాడు ఫిర్యాదు చేశాడు. రషీద్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సలీంను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెహానా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications