Mega vaccination: హైదరాబాద్‌లో ఒకేరోజు 40 వేల మందికి: అక్కడ ప్రారంభం

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. సైబరాబాద్ పోలీసులు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టారు. కొద్దిసేపటి కిందటే ఈ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇది. 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికి టీకాలను వేయడానికి సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, మెడికవర్ ఆసుపత్రి సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తోన్నాయి.

మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత కూడా వేచి చూస్తోన్న వారికి టీకా వేస్తారు. 40 వేల మందికి టీకాలు వేయాలనేది సైబరాబాద్‌ పోలీసుల లక్ష్యం. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 500 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను వినియోగిస్తోన్నారు.

Hyderabad: Telanganas mega vaccination drive for 18 plus at Hitex Exhibition, begins

వ్యాక్సిన్ వేయించుకోదలిచిన వారు మెడికవర్ ఆసుపత్రి వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను రిజిస్టర్ చేయించుకునే అవకాశం కల్పించారు. వారికి క్యూఆర్ కోడ్‌ను జారీ చేశారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ద్వారం వద్ద మరోసారి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. 40 వేల మందికి ఒకేరోజు వ్యాక్సిన్ వేయాలని తాము లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణా యేదుల తెలిపారు. వ్యాక్సిన్ ఒక్కటే కరోనా నివారణకు మార్గమని చెప్పారు. వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+