హైదరాబాద్‌ను యుటి చేయాలనడం హాస్యాస్పదం: జగన్ పార్టీ
హైదరాబాద్: హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయాలని తాము గట్టిగా కోరుతున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శనివారం భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌లోని సీమాంధ్రుల హక్కులకు భంగం కలిగితే తమ పారి్టీ ముందుండి పోరాడుతుందన్నారు. చంద్రబాబు హక్కుల కోసమే సెక్షన్-8 ముందుకుతెచ్చారని విమర్శించారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలనడం హాస్యాస్పదమని మోహన్‌రెడ్డి అన్నారు.

ఈసీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, కె.శ్రీనివాసులు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఓటుకు కోట్లు కేసుతో టీడీపీని భ్రష్టు పట్టించి రాష్ట్రం పరువు తీసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కర్నూలు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అక్రమాలతో టీడీపీ గెలవాలని చూస్తోందని విమర్శించారు.
వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన 80 మంది ఓటర్లు అధికంగా ఉన్న అక్రమంగా గెలవాలనే టీడీపీ కర్నూలు జిల్లాలో పోటీ చేస్తోందని మండిపడ్డారు. పోలీసులను, రెవెన్యూ అధికారులను చెప్పు చేతుల్లోకి తీసుకుని అధికార దుర్వనియోగం చేస్తున్నారని ఆరోపించారు.
కర్నూలు జిల్లాలోని ప్యాపిలి, డోన్‌ల్లో తమ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవటం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను బెదిరించి వేలి ముద్రలను వేయించి ఓట్లు వేయించాలని చూస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications