నేను చాలా హర్టయ్యాను: నాగబాబు

గొప్ప వ్యక్తుల గురించి అర్ధం పర్దంలేని విమర్శలు చేయొద్దని నాగబాబు సూచించారు.

జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. బౌద్ధమతం, గౌతమ బుద్ధుడి మరణం గురించి ప్రస్తావించారు. 'కొంత మంది మతవాదులు బౌద్ధమతాన్ని విమర్శించే ప్రయత్నంలో బుద్దుడు కుళ్ళిన పంది మాంసం తిని చనిపోయాడు అని చెప్తుంటే కొంచెం బాధపడ్డానని చెప్పారు. ఆయన శాఖాహారి అని, ఆయన తిన్న శాఖాహారం Pig Delight అనే ఒక పుట్టగొడుగు అన్నారు. పుట్టగొడుగు శాఖాహారం.. పైగా 80నుంచి 90 ఏళ్ల వయసులో ఆ ఆహారం బుద్ధుడికి పడలేదని, ఆయనతో పాటు తిన్న ఆయన శిష్యులకు ఏమి కాలేదని, ఆయన వయసు మీద పడటం.. పుట్టగొడుగు వల్ల వచ్చిన ఎలర్జీతో చనిపోయి ఉంటారని విశ్లేషణ చేశారు. అలాంటి గొప్ప వ్యక్తుల గురించి అర్ధం పర్దంలేని విమర్శలు చేయొద్దని సూచించారు.

I am very hurt: Nagababu

నాగబాబు చేసిన ట్వీట్ పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఆయన శిష్యుడు చద ఇచ్చిన పంది మాంసం తిని విరేచనాలవడంతో బుద్ధుడు మరణించాడని, చాలా పుస్తకాల్లో ఇలాగే రాసివుందన్నారు. పంది మాంసం తిన్నంతమాత్రాన వారు గొప్పవారు కాకుండా పోతారా? చరిత్ర చూసినవాళ్లు లేనప్పుడు రాసినవే నమ్మాలని రాసుకొచ్చారు. 'ఇంత జ్ఞానం ఉన్న మీరు పార్లమెంట్ లో ఉండాలి సార్.. ఈసారి ఎలాగైనా నర్సాపురం లో గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టాలి'అని మరొకరు కామెంట్ చేశారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+