నమ్మకుంటే ఖర్మ: సిద్ధాంతిని మోసిన కెసిఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రముఖ సిద్ధాంతి పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతిని పల్లకిలో మోశారు. సోమవారం రవీంద్ర భారతి ఆడిటోరియంలో దర్శనమ్ ఆధ్యాత్మిక పత్రిక తొమ్మిదో వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కొడకండ్ల గ్రామానికి చెందిన పాలకుర్తి సిద్ధాంతిని ధార్మిక వరేణ్య బిరుదుతో సన్మానించారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. ఇటీవల తనకు అమ్మవారి అయత చండీయాగం నిర్వహించాలన్న సంకల్పం కలిగిందని, త్వరలోనే దాన్ని పాలకుర్తి సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. దేశం ధర్మం పునాదుల పైన ఉందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ కెవి రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ గురుమదనానంద పీఠం(తొగుట) అధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి, శ్రీ జగన్నాథ మఠం(సీతారాంబాగ్, హైదరాబాద్) అధిపతి శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామి, శ్రీ పీఠం(కాకినాడ) అధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి, సిఎల్ రాజం, చుక్కా రామయ్య, నాయిని నర్సింహా రెడ్డి, చక్రపాణి, రాపోలు ఆనంద భాస్కర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నృసింహరామ సిద్ధాంతికి కెసిఆర్ పసిడి కంకణ ధారణ చేశారు. అంతకుముందు రవీంద్ర భారతి ప్రధాన ద్వారం నుంచి హాలు వరకు సిద్ధాంతిని పల్లకిలో మోసుకువచ్చారు. కెసిఆర్ స్వయంగా పల్లకిని మోసి సిద్ధాంతి పట్ల గౌరవ ప్రపత్తులను చాటుకున్నారు. తాను యాగాలు చేస్తానని, తనకు యాగాలపై నమ్మకం ఉందన్నారు. ఎవరైనా యాగాలను నమ్మకపోతే అది వారి ఖర్మ అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలపై భారత పునాది ఆధారపడి ఉందన్నారు. రానూరానూ ధర్మానికి దూరం కావడం వల్లే అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని అరవిందరావు ఆందోళన వ్యక్తం చేశారు.

సిద్ధాంతి - కెసిఆర్ 1

సిద్ధాంతి - కెసిఆర్ 1

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రముఖ సిద్ధాంతి పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతిని పల్లకిలో మోశారు.

సిద్ధాంతి - కెసిఆర్ 2

సిద్ధాంతి - కెసిఆర్ 2

ఆధ్యాత్మిక మాసపత్రిక 'దర్శనమ్' నవమ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రవీంద్ర భారతిలో కొడకండ్ల సిద్ధాంతి నృసింహరామ సిద్ధాంతికి జీవన సాఫల్య పురస్కారాన్ని, 'ధార్మిక వరేణ్య' బిరుదును ప్రదానం చేశారు.

సిద్ధాంతి - కెసిఆర్ 3

సిద్ధాంతి - కెసిఆర్ 3

సోమవారం రవీంద్ర భారతిలో కొడకండ్ల సిద్ధాంతి నృసింహరామ సిద్ధాంతికి జీవన సాఫల్య పురస్కారాన్ని, 'ధార్మిక వరేణ్య' బిరుదును ప్రదానం చేశారు.

సిద్ధాంతి - కెసిఆర్ 4

సిద్ధాంతి - కెసిఆర్ 4

పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ ఎంపీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పసిడి కంకణ ధారణ చేశారు.

సిద్ధాంతి - కెసిఆర్ 5

సిద్ధాంతి - కెసిఆర్ 5

ఈ కార్యక్రమంలో శ్రీ గురుమదనానంద పీఠం(తొగుట) అధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి, శ్రీ జగన్నాథ మఠం(సీతారాంబాగ్, హైదరాబాద్) అధిపతి శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామి, శ్రీ పీఠం(కాకినాడ) అధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి, సిఎల్ రాజం, చుక్కా రామయ్య, నాయిని నర్సింహా రెడ్డి, చక్రపాణి, రాపోలు ఆనంద భాస్కర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సిద్ధాంతి - కెసిఆర్ 6

సిద్ధాంతి - కెసిఆర్ 6

శ్రీ గురుమదనానంద పీఠం(తొగుట) అధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి, శ్రీ జగన్నాథ మఠం(సీతారాంబాగ్, హైదరాబాద్) అధిపతి శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామి, శ్రీ పీఠం(కాకినాడ) అధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామిలు వేదికపై...

సిద్ధాంతి - కెసిఆర్ 7

సిద్ధాంతి - కెసిఆర్ 7

సోమవారం రవీంద్ర భారతి ఆడిటోరియంలో దర్శనమ్ ఆధ్యాత్మిక పత్రిక తొమ్మిదో వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కొడకండ్ల గ్రామానికి చెందిన పాలకుర్తి సిద్ధాంతిని ధార్మిక వరేణ్య బిరుదుతో సన్మానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+