ఆన్‌రాక్‌తో వేలకోట్లు, బయటపెడ్తా: జగన్‌పార్టీ గీత ట్విస్ట్
విశాఖపట్నం: అరకులో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయని, అపార ఖనిజ నిల్వలు ఉన్నాయని ఆన్‌రాక్ పేరుతో 2007లో సుమారు రూ.6వేల కోట్లు డ్రా చేశారని, దానికి సంబంధించిన ఆధారాలన్నీ త్వరలో బయటపెడతానని, తాను రాజీనామా చేయనని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆ పార్టీ అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత బుధవారం చెప్పారు.
తాను రాజీనామా చేయాల్సినంత తప్పు చేయలేద్నారు. ప్రజాధనాన్ని వృధా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విడిచిపెట్టే ఆలోచన తనకు లేదన్నారు. ఆ పార్టీలోనే కొనసాగుతానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్డీయే, టీడీపీతో కలిసి పని చేస్తానని తెలిపారు.
తాను బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యానించడాన్ని ఆమె తప్పుబట్టారు. బాక్సైట్ సంబంధించి రస్ ఆల్ కైమా ఎలా వచ్చింది? ఎవరివో అందరికీ తెలుసునని ఎదురుదాడికి దిగారు. దీనిపై, కేంద్ర, రాష్ట్ర గనులు శాఖ మంత్రులకే కాకుండా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు.

తొలినుంచి తాను బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలోలాటరైట్ పేరుతో బాక్స్టైట్‌ను తవ్వుతున్నదెవరని నిలదీశారు. జగన్ సోదరి షర్మిల పైన ఆరోపణలు వస్తే తనతో సహా అందరు ఖండించారని, ఇప్పుడు తన పైన ఫేస్‌బుక్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తే ఒక్కరు ఖండించలేదన్నారు.
తన కులంపై సొంత పార్టీకి చెందిన ఈశ్వరి అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. తాను ఎస్టీని కాదని, ఎన్నిక అఫిడవిట్‌ని ఫోర్జరీ సంతకాలతో దాఖలు చేశానని ఈశ్వరి చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. ఎస్టీని కాకుండా తనకు ఆ పార్టీ తనకు బి ఫారం ఇచ్చిందా? అని ప్రశ్నించారు.
పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పించకపోగా కనీస గౌరవం కూడా లభించదన్నారు. తనపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వ్యవహారాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. జగన్‌కు ఫిర్యాదు చేసినా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications