నా నియోజకవర్గంలో వేలుపెడితే రౌద్ర శంకరుడినే: రాజయ్య వార్నింగ్

వరంగల్: తన నియోజకవర్గమైన స్టేషన్‌ఘన్‌పూర్ విషయంలో ఏ ఒక్కరూ వేలు పెట్టినా సహించబోనని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, మాజీ డిప్యూడీ సిఎం రాజయ్య హెచ్చరించారు. తాను భోళాశంకరుడిని ఎవరైనా అనుకుంటే పొరపాటేనని అన్నారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడినవుతానని అన్నారు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో అధికార పార్టీని, ఎమ్మెల్యే పదవిని తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజయ్య తెలిపారు.

I will not compromise for my constituency, warns rajaiah

సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కడియం

ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు తెలంగాణ జాతిపత అని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను వరంగల్ జిల్లా టిఆర్‌ఎస్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని కొనియాడారు. పేదల సంక్షేమానికి పాటు పడుతున్న కేసీఆర్‌ను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ సాధించిన యోధుడు కేసీఆర్ అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+