రాజీనామాకు కొత్తపల్లి గీత నో, టీపై ఉమ ఫిర్యాదు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేధింపుల పైన తాను సభాపతికి, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత తెలిపారు. రాజ్యాంగం పైన తనకు నమ్మకం ఉందని, తన పైన స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. అప్పటి వరకు తాను పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయనని చెప్పారు.
కాగా, తెలుగుదేసం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు శబ్యులతో శనివారం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అసంతృప్త పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత కూడా హాజరయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టికెట్‌పై గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం కొత్తపల్లి గీత మాట్లాడారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. తాను పని చేస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొనసాగలేనని చెప్పారు.

భవిష్యత్తులో బిజెపి, టిడిపిలతో కలిసి పని చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గం అభివృద్ధికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సహకరించడం లేదని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కోసమే టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నానని చెప్పారు. ప్రజా సేవ అడ్డుకుంటుందనే జగన్ పార్టీ నుండి బయటకు వచ్చానని తెలిపారు. ఇక నుండి టీడీపీ, బీజేపీ ఏర్పాటు చేసిన అన్ని సమావేశాలకు హాజరవుతానని తెలిపారు.
తెలంగాణ సర్కారుపై ఉమ ఫిర్యాదు
శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోతున్నా లెక్క చేయకుండా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్న తెలంగాణ సర్కారు తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఆదివారం గవర్నర్ నరసింహన్‌ను ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ రాజ్ భవన్‌లో కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు వైఖరిపై ఉమ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్కారు తమ విజ్ఞప్తులను పెడచెవిన పెడుతోందని, నీటి మట్టం ఆందోళనకర స్థాయికి పడిపోతున్నా, విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోందని తెలిపారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్‌ను కోరారు.












Click it and Unblock the Notifications