నా అరెస్ట్‌కి యత్నిస్తే కేసీఆర్‌కు అదే ఆఖరిరోజు: బాబు, ఒత్తిడిలోనా?
న్యూఢిల్లీ: తనను అరెస్టు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రయత్నాలు చేస్తే అతని ప్రభుత్వం కూలుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఓ జాతీయ టీవీ ఛానల్‌తో చెప్పారు.
తనను అరెస్టు చేసినా, చెసేందుకు ప్రయత్నించినా కేసీఆర్ ప్రభుత్వానికి అదే ఆఖరి రోజు అని అభిప్రాయపడ్డారు. ఆడియో టేపుల వ్యవహారంలో తానెందుకు సమాధానం చెప్పాలన్నారు.
కేసీఆర్ తన సంభాషణలను రికార్డి చేసి ఉండవచ్చు లేదా ఆయన ఛానల్ చేసి ఉండవచ్చునని చెప్పారు. లేదా సంభాషణలను సృష్టించి ఉండవచ్చునని చెప్పారు. ఈ విషయంలో తాను సమాధానం ఎందుకు చెప్పాలన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలంగా ఉండేందుకు తాను చేపట్టిన చర్యలను చూసి ఓర్వలేక కేసీఆర్ తన పైన రాజకీయ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాయని, రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలవేనని, గతంలోను అదే చెప్పానని, మనం తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఇరు రాష్ట్రాలనూ అభివృద్ధి చేసుకోవాలన్నారు. కేసీఆర్ అందుకు సహకరించడం లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, మంత్రి పదవిలిచ్చారని చెప్పారు.
అరెస్టుకు నేనెందుకు భయపడాలన్నారు. నన్ను అరెస్టు చేసేందుకు కేసీఆర్ ఎవరన్నారు. మీకు ఏసీబీ ఉందని, మాకు ఏసీబీ ఉందని చెప్పారు. నేను సీఎంను అని చెప్పారు. తెరాస పరిమితులు తెలుసుకుంటే మంచిదన్నారు. కేసీఆర్‌కు నేనెందుకు సమాధానం చెప్పాలన్నారు. ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఒకింత ఉక్రోషంతో మాట్లాడినట్లుగా కనిపించింది.
ఢిల్లీ నుండి రాగానే నోటీసులు?
ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ మరో ముందడుగు వేయనుందని తెలుస్తోంది. పూర్తి సాక్ష్యాధారాలతో సమగ్ర నివేదికను బుధవారం కోర్టుకు సమర్పించనుంది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయనుంది.
ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే విషయంలో కూడా సీనియర్ అధికారులను సంప్రదించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత నోటీసులు ఇవ్వవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications