IIIT: ట్రిపుల్ ఐటీలపై తేల్చేసిన లోకేష్..! అదే క్యాంపస్ లో..!
ఏపీలో ట్రిపుల్ ఐటీల్లో (IIIT) చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది. ఓవైపు రెగ్యులర్ వీసీ లేక ఒరిజినల్ డిగ్రీ సర్ఠిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్ధులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత సదుపాయాలు లేక విద్యార్ధులు బయటికి వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులపై ఇవాళ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు విద్యామంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు
రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత సదుపాయాలకు అవసరమైన నిధుల కోసం ఆర్థికశాఖ మంత్రితో మాట్లాడామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం కొత్తగా సాస్కీ స్కీమ్ తీసుకొచ్చిందని, డీపీఆర్ లు తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కొంత నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో నూజివీడు క్యాంపస్ లో శాశ్వత సదుపాయాల కల్పనకు రూ.60కోట్లు, అరకు వ్యాలీలో రూ.40 కోట్లు, ఒంగోలు క్యాంపస్ కు రెండు విడతలకు కలిపి రూ.600 కోట్లు, శ్రీకాకుళం క్యాంపస్ కు రూ.300 కోట్లు అవసరమని లోకేష్ తెలిపారు.

అలాగే పుట్టపర్తిలో కొత్తగా ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు గల అవకాశాలపై ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏ జిల్లాలో ట్రిపుల్ ఐటీ చదివే పిల్లలు అక్కడే పూర్తిచేయాలన్నది తమ ఆలోచన అని లోకేష్ తెలిపారు. తాత్కాలిక అకాడమీ కోసం వేర్వేరు జిల్లాలకు పంపాల్సి వస్తోందన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి శాశ్వత సౌకర్యాలను కల్పించి,, ఏ క్యాంపస్ లో పిల్లలు చేరారో అదే క్యాంపస్ లో కోర్సు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications