బలపడుతున్న అల్పపీడనం, రెడ్ అలర్ట్ - రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ. కుండపోత వర్షాలతో నదులు..వాగులు పొంగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారుల పైన వర్షపు నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కాగా, తాజాగా బంగాళాఖాతంలో అల్పీ పడనం బలపడుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని కారణంగా రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు ఐఎండీ గుర్తించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా కదులుతున్నట్లు తెలిపింది. దీనివల్ల ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్​, కరీంనగర్​, ఖమ్మం, నిజామాబాద్​ జిల్లాల్లో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఉత్తర తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో కుండపోతగా వర్షం పడింది.

imd-alerts-on-heavy-rains-for-nine-telangana-districts-in-next-two-days

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం శేర్పల్లి (బి) గ్రామ సమీపంలో గురువారం 44వ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)ని వరద ముంచెత్తింది. అక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో కల్వర్టును మూసివేశారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో గత వారం రోజులుగా కొంతమేర వరదను దిగువన ఈసీ నదిలోకి వదులుతుండగా గురువారం ఏకంగా 10 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 13,450 క్యూసెక్కులు వదిలారు. సూర్యాపేట జిల్లాలో భారీవర్షంతో వరదలు ముంచెత్తి జనజీవనం స్తంభించింది. జిల్లాలో 6.62 సెం.మీ. వర్షపాతం నమోదవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు ఉప్పొంగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+