Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీ అలర్ట్.. ఏపీ వాసులకు తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు బెంబేలెత్తిస్తున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అదే సమయంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. రానున్న కొద్ది గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఏపీలో కొద్ది రోజులుగా వరుసగా వడగాల్పుల హెచ్చరికల జారీ అయ్యాయి. పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం పాటు వడగాలుల తీవ్రత కొనసాగింది. ఇప్పుడు తాజాగా వాతావరణ శాఖ పలు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తూ తాజా అలర్ట్స్ జారీ చేసింది. ఉయభగోదావరి జిల్లాలతో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

IMD Alerts on Thunderstorm accompanied with lightning in many parts of state in coming hours

పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశు-గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చిరించింది. పంట పొలాల్లో, బయటి ప్రాంతాల్లో చెట్ల కింద ఉండొద్దని సూచించింది. మరో వైపు అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు నష్టం చేస్తున్నాయి. భారీగా పంట నష్టం జరిగింది.

తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఏపీలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్ద్రరాత్రి కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రైతులు నష్టపోయినట్లు ప్రాధమిక సమాచారం.

ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాల్లో 1,516 మంది రైతులకు చెందిన 2,091 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటల్లినట్లు జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. మరో 220 ఎకరాల్లోని మామిడితోటల్లో కాయలు రాలిపోయినట్లు ఉద్యానశాఖ అధికారులు పేర్కొన్నారు.

ప్రాధమిక నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసి న అకాల వర్షంతో పలు ప్రాంతాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. అదేవిధంగా కోతకు వచ్చిన వరిచేలు ఈదురుగాలుల కు నేలకొరిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+