• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలోకి రేపే రుతుపవనాల ఎంట్రీ: ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రుతుపవనాలు సాధారణంగా పురోగమిస్తున్నాయని, మరో రెండు రోజుల్లో మహారాష్ట్రకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. మే 29న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకి దక్షిణ, మధ్య అరేబియా సముద్రం, కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, మే 31 నుంచి జూన్ 7 మధ్య మొత్తం ఈశాన్య ప్రాంతాలను ఆక్రమించాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్‌కే జెనామణి తెలిపారు.

ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు: రెడ్ అలర్ట్ జారీ

ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు: రెడ్ అలర్ట్ జారీ

రుతుపవనాల పురోగతిలో ఎలాంటి జాప్యం లేదు. ఇది మరో రెండు రోజుల్లో మహారాష్ట్రకు చేరుకునే అవకాశం ఉందని, తదుపరి రెండు రోజుల్లో ముంబైని కవర్ చేసే అవకాశం ఉందని, దాని పురోగతి మందగించిందని వచ్చిన వార్తలను తోసిపుచ్చారు.
కాగా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించింది. రుతుపవనాలు మొత్తం ఈశాన్య ప్రాంతాన్ని కవర్ చేశాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ రెడ్ అలర్ట్ అనేది రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలకు హెచ్చరికగా ఉంది. అధిక వర్షపాతం కారణంగా సాధ్యమయ్యే సంఘటనలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ఇది సూచిస్తుంది.

భారీ వర్షాలతో మూడు రాష్ట్రాల్లో 43 మంది మృతి

భారీ వర్షాలతో మూడు రాష్ట్రాల్లో 43 మంది మృతి

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) కూడా కొండచరియలు విరిగిపడే, వరద పీడిత ప్రాంతాలలో హెచ్చరికను జారీ చేసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలా గంటలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉపరితల కమ్యూనికేషన్‌ను తాత్కాలికంగా ప్రభావితం చేసింది.ఈ ఏడాది మే నుంచి మూడు రాష్ట్రాల్లో(అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేఘాలయ) వర్షాల కారణంగా సంభవించిన విపత్తుల కారణంగా కనీసం 43 మంది మరణించారు. ఒక్క అస్సాంలోనే వరదలు 27 మందిని బలిగొన్నాయి.

కొండచరియలు విరిగిపడి నలుగురు సజీవ సమాధి

కొండచరియలు విరిగిపడి నలుగురు సజీవ సమాధి

మేఘాలయలోని గారో హిల్స్‌లో గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, రెండున్నరేళ్ల చిన్నారితో సహా కనీసం నలుగురు వ్యక్తులు సజీవ సమాధి అయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. వెస్ట్ గారో హిల్స్‌లోని గంబెగ్రే బ్లాక్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించిన మొదటి సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండో ఘటన నైరుతి గారో హిల్స్‌లోని బేటాసింగ్ ప్రాంతంలో ఓ చిన్నారి మృతి చెందింది. బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కొండచరియలు విరిగిపడ్డాయి.

Recommended Video

  Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
  ఏపీలోకి రేపే రుతుపవనాలు ఎంట్రీ: కోస్తా, సీమలో భారీ వర్షాలు

  ఏపీలోకి రేపే రుతుపవనాలు ఎంట్రీ: కోస్తా, సీమలో భారీ వర్షాలు

  శనివారం మధ్యాహ్నంలోగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయి. రెండు రోజుల్లో రాష్ట్రంతో పాటు పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళకు మూడు రోజులు ముందుగానే వచ్చిన రుతుపవనాలు జూన్‌ 7న రాష్ట్రానికి విస్తరించాల్సి ఉన్నా.. వాతావరణం అనుకూలించక జాప్యమైంది.వారం రోజులుగా దక్షిణ కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బుధవారం గోవా వరకు వ్యాపించాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి ఆవరించి ఉన్నందున శుక్ర, శని వారాల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. దక్షిణ ఆంధ్రలో ఒకట్రెండు చోట్ల వడగాడ్పులు వీయొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.

  English summary
  monsoon: IMD warns of heavy rainfall in these states, red alert issued. tomorrow monsoon will reache Andhra Pradesh
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X