Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఇద్దరి మంత్రులకు జగన్ బంపరాఫర్..అర్థరాత్రి మంతనాలు..ఆ నలుగురు పేర్లు ఖరారు

ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ నుండి పెద్దల సభకు పంపే నలుగురి పేర్లు ఖరారు చేసారు. ఊహించని విధంగా తన కేబినెట్ లోని ఇద్దరు బీసీ మంత్రులను పెద్దల సభకు పంపాలని డిసైడ్ అయ్యారు.

జగన్ అర్థరాత్రి మంతనాలు

జగన్ అర్థరాత్రి మంతనాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా తగ్గించి..బీసీలకు అన్యాయం చేసారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను కష్టాల్లో ఉన్న సమయంలో తనతో కలిసి నడిచిన వారికి తాను గుర్తింపు ఏ విధంగా ఇచ్చేదీ నిరూపించుకొనే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, మూడో స్థానం పార్టీ స్థాపన నుండి తనతో నిలిచిన నేతకు ఇవ్వనున్నారు. ఇక, ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి నత్వానీకి రాజ్యసభ ఇవ్వాలని అభ్యర్ధించటంతో ఆయనకు సైతం జగన్ ఓకే చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నాలుగు పేర్లను ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, వైవీ సుబ్బారెడ్డి..బీదా మస్తానరావు..మేకపాటి రాజమోహన రెడ్డి..పండుల రవీంద్ర బాబు వంటి వారు సైతం పోటీలో ఉన్నా..ఈ నలుగురు విషయంలో జగన్ దాదాపు నిర్ణయం తీసుకున్నారు.

ఆ ఇద్దరు మంత్రులకు జాక్ పాట్..

ఆ ఇద్దరు మంత్రులకు జాక్ పాట్..

జగన్ కేబినెట్ లో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటుగా మరో మంత్రి మోపిదేవి వెంకటరమణను పెద్దల సభకు పంపాలని జగన్ డిసైడ్ అయ్యారు. వారిద్దరితోనూ రాత్రి పొద్దు పోయిన తరువాత చర్చించారు. తొలుత మోపిదేవి అందుకు పూర్తిగా అంగీకారం తెలపకపోయినా..జగన్ చెప్పటంతో చివరకు అంగీకరించారు. వైయస్సార్ మరణం నాటి నుండి పిల్లి సుబాష్ చంద్రబోస్ పూర్తిగా జగన్ తోనే నిలిచారు. ఆయన కు జగన్ 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా మండపేట నుండి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే అప్పటికే ఎమ్మెల్సీగా ఉండటంతో జగన్ తన కేబినెట్ లో బీసీ కోటాలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపే శెట్టి బలిజ వర్గానికి చెందిన బోస్ కు ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వటం ద్వారా ఆ వర్గానికి మరింతగా దగ్గరయ్యేందుకు జగన్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక, మోపిదేవి గతంలో వైయస్పార్ హయాంలో మంత్రిగా పని చేసారు. ఆయన వాన్ పిక్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎదుర్కొని జగన్ తో పాటుగా జైలు శిక్ష అనుభవించారు. 2019 ఎన్నికల్లో రేపల్లె నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయినా..తనతో పాటుగా తొలి నుండి నిలిచిన మోపిదేవిని కేబినెట్ లోకి తీసుకొని జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు మండలి రద్దు నిర్ణయం తో వారిద్దరనీ రాజ్యసభకు ఖరారు చేస్తూ జగన్ నిర్ణయించారు.

అయోధ్య రామిరెడ్డి..నత్వానీకి ఖరారు

అయోధ్య రామిరెడ్డి..నత్వానీకి ఖరారు

ఇక, తన వ్యాపార భాగస్వామిగా ఉంటూ..తొలి నుండి రాజకీయంగా తనకు రాజకీయంగా అండగా నిలిచిన అయోధ్య రామిరెడ్డికి సైతం జగన్ రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2014 ఎన్నికల్లో నర్సరావు పేట నుండి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వలేదు. అదే కుటుంబానికి చెందిన మోదుగుల వేణుగోపాల రెడ్డికి ఎంపీగా సీటు ఇవ్వటం.. అదే విధంగా అయోధ్య రామిరెడ్డి సోదరుడు ఆళ్ల రామక్రిష్టారెడ్డికి మంగళగిరి నుండి గెలిస్తే కేబినెట్ లో స్థానం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

అయితే, సామాజిక సమీకరణాలతో చివరి నిమిషంలో ఆళ్ల రామక్రిష్టా రెడ్డికి కేబినెట్ లో స్థానం దక్కలేదు. దీంతో..ఇప్పుడు అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, ప్రముఖ పారిశ్రామిక వేత్త స్వయంగా వచ్చి తమ సహచరుడు పరిమల్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరటంతో..జగన్ దీని పైన పార్టీ నేతలతో చర్చించారు. అయితే, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని నత్వానీకి సైతం సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. మూడు స్థానాలు వైసీపీకి..ఒకటి స్వతంత్ర అభ్యర్ధిగా నత్వానీని ఏపీ నుండి పెద్దల సభకు పంపనున్నారు.

Recommended Video

    TDP MLC Buddha Venkanna Made Comments On CM Jagan | Oneindia Telugu
     వారికి నేతల బుజ్జగింపులు..

    వారికి నేతల బుజ్జగింపులు..

    రాజ్యసభ సీట్ల పైనా పార్టీ నేతలు పలువురు ఆశలు పెట్టుకున్నారు. వారిలో వైవీ సుబ్బారెడ్డి..బీదా మస్తానరావు..మేకపాటి రాజమోహన రెడ్డి..పండుల రవీంద్ర బాబు వంటి వారు ఉన్నారు అయితే, రానున్న రోజుల్లో మరిన్ని సీట్లు వైసీపీకి రానున్నాయి. 2024 నాటికి మొత్తంగా 12 మంది వైసీపీ నుండి రాజ్యసభ లో సభ్యులుగా ఉండనున్నారు. ఇప్పుడు ఆశిస్తున్న వారికి భవిష్యత్ లో అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

    అయితే, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశం ద్వారా రాజకీయంగా టీడీపీ ముఖ్యమంత్రిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది. దీంతో..ఇప్పుడు ఏకంగా ఇద్దరు బీసీ లకు రాజ్యసభ అవకాశం ఇవ్వటం ద్వారా..పూర్తిగా పై చేయి సాధించాలని జగన్ భావిస్తున్నారు. చివరి నిమిషంలో మార్పులు లేకుంటే దాదాపుగా ఈ సాయంత్రానికి ఈ నాలుగు పేర్లను వైసీపీ తమ రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించటం ఖాయంగా కనిపిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+