భారతదేశపు మొట్టమొదటి ఏసీ రైలు

భారతీయ రైల్వేలు ప్రస్తుతం జనరల్ బోగీలతోపాటు ఏసీ, స్లీపర్, చైర్ కార్ కోచ్‌లతో రైళ్లను నడుపుతున్నాయి. ప్రజలు తమ సౌలభ్యం ప్రకారం ఏ బోగీల్లో ప్రయాణించాలనుకుంటున్నారో ఆ బోగీలకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ ఖరీదు ఎక్కువగా ఉంటాయి. వీటిమీద ఖరీదు తక్కువ.. స్లీపర్ మీద ఎక్కువగా ఉండే థర్డ్ ఏసీకి ఆదరణ బాగుంటుంది. ఏసీలో ప్రయాణించాలనుకునేవారు థర్డ్ ఏసీకి ప్రాధాన్యత ఇస్తారు.

ప్రస్తుతం భారతీయ రైల్వే నడుపుతున్న వందే భారత్ రైలు పూర్తి ఏసీ బోగీలతో నిండి వుంటుంది. సెమీ హైస్పీడ్ గా ప్రఖ్యాతి చెందిన ఈ రైళ్లను దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో, డివిజన్లలో ప్రవేశపెడుతున్నారు. దీనికి ఎనిమిది బోగీలుంటాయి. దేశ విభజనకు ముందు 1934లో మొదటి AC రైలును ప్రవేశపెట్టారు. ఏసీకి బదులుగా ఐస్ క్యూబ్స్ వాడేవారు. అప్పట్లోనే ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అంటూ విభజించారు. ఫస్ట్ క్లాస్ లో బ్రిటీష్ వారు మాత్రమే ప్రయాణించేవారు. తమ సౌలభ్యం కోసం అధికారులు ఈ వ్యవస్థను రూపొందించారు. ఏసీకి బదులుగా ఐస్ బ్లాక్స్ వాడారు.

indian first ac train frontier mail

1928 సెప్టెంబరు ఒకటోతేదీన ముంబయిలోని బల్లార్డ్ పీర్ స్టేషన్ నుంచి ఢిల్లీ, భటిండా, ఫిరోజ్‌పూర్, లాహోర్ మీదుగా పెషావర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)కి ఈ ఏసీ రైలు బయలుదేరింది. 1930 మార్చి నుంచి సహరాన్‌పూర్, అంబాలా, అమృత్‌సర్, లాహోర్‌లకు మళ్లించారు. ముందుగా ఐస్ బ్లాక్స్‌తో బోగీని చల్లగా ఉంచేవారు. ఆ తర్వాత దానికి ఏసీ సిస్టమ్‌ను యాడ్ చేశారు. ఈ రైలు పేరు ఫ్రాంటియర్ మెయిల్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గోల్డెన్ టెంపుల్ మెయిల్ పేరుతో ఇది పనిచేయడం ప్రారంభించింది.

బ్రిటిష్ కాలం నాటి అత్యంత లగ్జరీ రైలు.. ఫ్రాంటియర్ మెయిల్. విలాసవంతమైన రైళ్లల్లో ఇది కూడా ఒకటి. ఆవిరితో 60 కిలోమీటర్ల వేగంతో నడిచేది. ప్రస్తుతం విద్యుత్తుతో నడుస్తోంది. 1893 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 35 స్టేషన్లలో ఆగుతుంది. 24 కోచ్ ల్లో 1300 మంది పడతారు. టెలిగ్రామ్స్ తీసుకువెళ్లడానికి, తీసుకు రావడానికి దీన్ని ఉపయోగించేవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+