కర్నూలు-విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు నగరం నుంచి కోస్తాంధ్రలో ఉన్న అమరావతి రాజధాని పరిధిలోని విజయవాడ నగరానికి ప్రయాణించే వారికి శుభవార్త. రాజధాని అమరావతి పనులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రాయలసీమ నుంచి ఇక్కడికి రాకపోకలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో రెగ్యులర్ గా రాకపోకలు సాగించే వారికి ఈ రెండు కీలక నగరాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రెగ్యులర్ విధానంలో విమానాలు నడిపేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ సిద్దమైంది. ఇవాళ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి కర్నూలు-విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసుల్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రస్తుతానికి వారానికి మూడు రోజుల పాటు ఈ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. అనంతరం వీటిని రోజువారీ సర్వీసులుగా విస్తరిస్తారు.

indigo airlines launches kurnool-vijayawada flight services available thrice in week

రాయలసీమలోని కర్నూలు ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడి నుంచి రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ విమానాలు నడిపేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు అమరావతి రాజధానికి ప్రయాణాన్ని సులభతరం చేస్తూ ఇండిగో రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించింది. అలాగే కర్నూలు నుంచి ఇతర ప్రాంతాలకు కూడా మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+