ఏపీలో వెలుగు చూసిన శిశు విక్రయం .. పట్టుకున్న అధికార యంత్రాంగం

ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో లాక్ డౌన్ విధించినప్పటికీ ఇది అది అన్న తేడా లేకుండా అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో శిశు విక్రయం సంచలనం రేపింది . విజయవాడ చుట్టుగుంట గులామ్‌ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక్రయించిన సంఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది . ఇక ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు శిశువును ఆస్పత్రికి తరలించి విక్రయానికి పాల్పడిన , కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేశారు.

శిశువును విక్రయించిన తల్లి

శిశువును విక్రయించిన తల్లి

విజయవాడలో దారుణం జరిగింది. ఒక తల్లి కన్న పాశాన్ని మరచి శిశువును విక్రయించింది . శిశువు తల్లి వేట బాలనాగమ్మ ఈనెల 7వ తేదీన పాత ప్రభుత్వాస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది . బాలనాగమ్మకు శిశువును పెంచుకునే ఉద్దేశం లేదనే విషయం తెలుసుకున్న ఆస్పత్రిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వైఎస్సార్‌ కాలనీకి చెందిన రాణి శిశువును విక్రయించాలని ఆమెను సంప్రదించారు.దీంతో వీరిద్దరి మధ్య బేరం కుదిరింది .

రూ.16 వేలు తీసుకుని శిశువును సెక్యూరిటీ గార్డు కు అమ్మేసిన మహిళ

రూ.16 వేలు తీసుకుని శిశువును సెక్యూరిటీ గార్డు కు అమ్మేసిన మహిళ

వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈనెల 15న బాలనాగమ్మ ఆస్పత్రి నుంచి స్వచ్ఛందంగా డిచార్జ్‌ అయ్యి వెళ్ళేటప్పుడు రూ.16 వేలు తీసుకుని శిశువును సెక్యూరిటీ గార్డు అయిన రాణికి అప్పగించి వెళ్ళిపోయింది . ఇక అంతా అనుకున్నట్టే గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది అనుకున్న సమయంలో రాణి ఆ శిశువును గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని డోలాస్‌నగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంచారు. అయితే అక్కడ ఎవరూ గర్భిణీ లేకపోవటం, శిశువు సడెన్ గా అక్కడ ప్రత్యక్షం కావటంతో అనుమానించిన అంగన్‌వాడీ కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Recommended Video

    Disinfection Tunnel Open in Vijayawada at Indira Gandhi Stadium Municipal Stadium
     రంగంలోకి ఐసీడీఎస్ అధికారులు .. కేసు నమోదు

    రంగంలోకి ఐసీడీఎస్ అధికారులు .. కేసు నమోదు

    విజయవాడ ఐసీడీఎస్‌ సిబ్బంది రంగంలోకి దిగి విచారణ చేయగా శిశువు విక్రయం వెలుగుచూసింది. శిశువును రక్షించి అత్యవసర వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చట్టవిరుద్ధంగా శిశువును విక్రయించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశాం' అని పీడీ ఉమారాణి తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి ఉమారాణి కానూరులోని తన కార్యాలయంలో వెల్లడించారు. అసలే కరోనాతో రాష్ట్రంలో ఒక ఇబ్బంది కర వాతావరణం ఉన్న సమయంలో కూడా ఇట్లాంటి దారుణాలు వెలుగు చూస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+