శాంతి మేడమ్ చరిత్ర మొత్తం బయటకు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, దేవుడి ఆస్తులు
విశాఖపట్టణం ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గా పని చేసిన శాంతి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, వైసీపీ నాయకులు చెప్పినట్లు ఆమె విధులు నిర్వహించారని, సంబందం లేని విషయాల్లో ఆమె జోక్యం చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో శాంతి అధికార దుర్వినియోగం చేసి అప్పటి వైసీపీ నాయకులకు లాభం చేకూరేలా పూర్తిగా సహకరించారని అధికారులు ఆరోపిస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలోని దేవాదాయ శాఖకు చెందిన భూములు, దుకాణాలు నిబంధనలకు విరుద్దంగా లీజులు పొడగించారని అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అప్పటి వైసీపీ నాయకుల పరిచయాలు ఎక్కువగా ఉండటంతో దేవాదాయ శాఖలో ఆమెను అడిగేవారు లేకపోయారని, అలా వైసీపీ నాయకులు ఏం చెప్పినా, ఏం అడిగినా కాదనకుండా వారికి అనుకూలంగా శాంతి పని చేశారని, ప్రభుత్వ నియమాలను ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని ఉన్నతస్థాయి అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు రెండు సంవత్సరాలకు పైగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గా పని చేశారని, ఆ సందర్బంలో ఆమె అధికార దుర్వానియోగానికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విచారణలో వెలుగు చూసింది. లంకెలపాలెం పరదేశమ్మ ఆలయానికి సుమారు 10 ఎకరాల భూమి ఉంటే ఒక ఎకరానికి నెలకు కేవలం రూ. 20 వేల చొప్పున 11 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారని, అధికారుల మీద ఒత్తిడి తెచ్చిన శాంతి ఆ భూములను చాలా తక్కువకు లీజుకు ఇప్పించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
నెలకు రూ. 20 వేలకే ఎకరా భూమిని లీజుకు తీసుకున్న వ్యక్తులు తరువాత అదే భూములను నెలకు రూ. 2 లక్షలకు సబ్ లీజుకు ఇచ్చి భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నారని, ఇలా దేవదాయ శాఖకు భారీ మొత్తంలో నష్టం వస్తోందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ భూములు తక్కువ ధరకు లీజుకు ఇప్పించడంలో శాంతి కీలకపాత్ర పోషించారని అదికారులు ఆరోపిస్తున్నారు.

ఈ ప్రాంతంలోని దేవాలయాల భూములు, షాపులు వేలం నిర్వహించకుండానే ఒక్కరోజులో నిర్ణయం తీసుకున్న దేవాదాయ శాఖ అధికారులు బహిరంగ వేలం నిర్వహించకుండానే వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికి అప్పగించేశారని వెలుగు చూసింది. శాంతి వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో ఆమె చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని దేవాదాయ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఆయన్ను కలిసిన మీడియా మిత్రులకు చెప్పారని తెలిసింది.












Click it and Unblock the Notifications