తిరుమలలో 3డి అద్భుతం, దేశంలోనే తొలిసారి: నీళ్లలో, గులాబీపై నడిచిన అనుభూతి
చిత్తూరు: నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుమలలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప పర్దర్శన శాలలో మాయా తివాచీ, శ్రీ వేంకటేశ్వర స్వామి ఘట్టం సైకత శిల్పం శ్రీవారి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం 'మాయా తివాచీ' ఏర్పాటు ద్వారా భక్తులను ఆశ్చర్యపరుస్తున్నారు. దీనిని త్రీడి మోషన్ కాప్చర్ టెక్నిక్ ద్వారా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు భారత దేశంలో ఏ మత కేంద్రంలోను ఇలాంటి ఏర్పాటు చేయలేదు. దేశంలోనే టిటిడి మొదటిసారి భక్తులకు ఈ సౌకర్యం కలిగించింది.

చెన్నైకి చెందిన జయకుమార్, ప్రతాప్ కుమార్‌లు 'నీంగకేట్టవై' అనే తమిళ సంస్థ ద్వారా వివాహాది శుభకార్యాలకు అలంకరణ పనులు చేస్తుంటారు.
వీరు స్వచ్చంధంగా ముందుకు వచ్చి తొలిసారి తిరుమలలో పుష్ప ప్రదర్శన శాలలో 3డి మోషన్ క్యాప్చర్ పరిజ్ఞానంతో మత్స్యజల క్రీడ, సూర్యకాంతి, పూదోడ, రోజా రేకుల తివాచీలు ఏర్పాటు చేశారు. భక్తులు ఈ మాయా తివాచీల పైన నడిచినప్పుడు నీటిలోనూ, గులాబీ రేకుల పైన నడిచిన అనుభూతి పొందుతున్నారు.












Click it and Unblock the Notifications