మనవైపా? వాళ్లవైపా?
జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శల దాడిచేస్తున్న చంద్రబాబుకు ప్రజల స్పందన చూసి ఉత్సాహం కట్టలు తెచ్చుకుంటోంది.
వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ్ టీం వ్యవహరిస్తోంది. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలు రాబిన్ శర్మ సూచనలమేరకు జరుగుతున్నవే. చంద్రబాబు రోడ్ షోలు, జిల్లాల పర్యటనలు ఉండనే ఉన్నాయి. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పర్యటన పూర్తిచేసుకున్నారు.

మాటల తూటాలు పేలుస్తున్న లోకేష్
అన్నిరకాలుగాను ప్రజల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల ఇన్ ఛార్జిలను కూడా ప్రజలతో మమేకమవమని చెబుతోంది. దీనిపట్ల ఉదాసీనంగా వ్యవహరించేవారికి యువతరం కోటాలో సీటివ్వకపోవడం జరుగుతుందని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పర్యటనలకు ప్రజలు పోటెత్తుతున్నారు. మరోవైపు నారా లోకేష్ మాటల తూటాలు పేలుస్తున్నారు. టీడీపీ దూకుడు పెరిగిందంటూ కొన్ని మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో బాబు
జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శల దాడిచేస్తున్న చంద్రబాబుకు ప్రజల స్పందన చూసి ఉత్సాహం కట్టలు తెచ్చుకుంటోంది. అన్నిరకాలుగాను అనుకూలంగా ఓటర్లు టీడీపీవైపు ఉన్నారనుకుంటున్న తరుణంలో ఇవన్నీ ఓట్లగా రాలేనే అనే అంతర్మథనం పార్టీలో జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో కూడా మహిళలు పోటెత్తారని, కానీ అవన్నీ ఓట్ల రూపంలోకి రాలేదనే విషయాన్ని సీనియర్ నేతలు గుర్తుచేస్తున్నారు.

ఏమీ అర్థం కాకుండా ఉందే..
గత ఎన్నికలకు ముందు ఓటుబ్యాంకును సాధించుకోలేకపోయామనే అసంతృప్తిలో ఉన్న పార్టీకి ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నది ఒకపట్టాన అంతుపట్టకుండా ఉంది. ప్రజల నాడి ఎలా ఉందనే విషయం అర్థం కాకుండా ఉందని, ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్న పథకాలు తీసుకుంటున్నారు.. మరోవైపు చంద్రబాబు రోడ్ షోలకు వెల్లువలా తరలివస్తున్నారు. ఆయన చెప్పేవి కూడా వింటున్నారు. ఇటువంటి వాతావరణం నెలకొన్ని నేపథ్యంలో ఓటర్లు పూర్తిగా తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్నారా? లేదా? అనే విషయం స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు మరి.












Click it and Unblock the Notifications