సికింద్రాబాద్ నుంచి గోదావరి 'టెంపుల్ టూర్' - ఆలయాలు..రూట్, ప్యాకేజీ..!!

IRCTC మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ మధ్య కాలంలో ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు పుణ్య క్షేత్రాలు.. సందర్శనీయ స్థలాల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను ఖరారు చేస్తున్నారు. వీటికి మంచి స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ తరహా ప్యాకేజీల కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీంతో, తాజాగా ఐఆర్సీటీసీ గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ ని ప్రకటించింది. మూడు రోజుల పాటు సాగే ఈ టూర్ వివరాలను అధికారులు వెల్లడించారు.

లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా గోదావరి టెంపుల్ టూర్ ను ఖరారు చేసారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి రాత్రి 8.30 గంటలకు రైలు బయలు దేరుతుంది. 9.00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభం కానుంది. మరుసటి రోజు ఉదయం 4.38 గంటలకు రాజమండ్రి స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ పికప్ చేసుకొని హోటల్‌ కు తరలిస్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత అన్నవరం సందర్శనకు స్టార్ట్ అవుతారు. తిరిగి సాయంత్రం హోటల్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత గోదావరి ఘాట్, ఇస్కాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ రోజు రాత్రి బస రాజమండ్రిలోనే ఏర్పాటు చేసారు.

ircrc-announces-special-godavari-temple-package-for-three-days-trip-details

మూడో రోజున ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. అక్కడి నుంచి అంతర్వేదికి బయలుదేరుతారు. అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ సందర్శిస్తారు. ఆ తర్వాత బీచ్ లో ఎంజాయ్ చేస్తారు. అనంతరం శ్రీ బాల బాలాజీ దేవాలయం, విఘ్నేశ్వర ఆలయం, అప్పనపల్లి, అయినవల్లిని సందర్శిస్తారు. చివరగా సాయంత్రం ద్రాక్షారామం ఆలయాన్ని కూడా దర్శించుకొని రాత్రి 8.18 గంటలకు రాజమండ్రి రైల్వే స్టేషన్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ఓవర్ నైట్ జర్నీ సాగుతుంది. మరుసటి రోజు ఉదయం 4.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 5.55 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. దీంతో యాత్ర ముగుస్తుంది.

ఇక, ప్యాకేజీ ధరలను వివరించారు. కంఫర్ట్ (3 AC)లో సింగిల్ షేరింగ్ ​కు రూ. 15,340, డబుల్ షేరింగ్​ కు రూ. 8,940 గా ఖరారు చేసారు. ట్రిపుల్ షేరింగ్ ​కు రూ. 7,170 నిర్దారించారు. చిల్డ్రన్ విత్ బెడ్ రూ. 6,080 గా నిర్దారించారు. అదే విధంగా స్టాండర్డ్ (స్లీపర్)లో సింగిల్ షేరింగ్ ​కు రూ. 13,800 ఉండగా.. డబుల్ షేరింగ్​ కు రూ. 7,400 గా నిర్ణయించారు. ఈ టూర్ పైన ఆసక్తి ఉన్న ఐఆర్సీటీసీ పోర్టల్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+