రూ.12వేల ధరలో కేరళ ట్రిప్.. ఐఆర్ సీటీసీ ప్యాకేజ్

వేసవికాలంలో సెలవును సద్వినియోగం చేసుకోవాలంటే ఎక్కడైనా కొత్త ప్రాంతాలను చుట్టిరావాలని చాలామంది భావిస్తారు. అటువంటివారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది. కేరళ చూడాలని ఎప్పటినుంచో అనుకునేవారి కోసం ఆ రాష్ట్రానికి ట్రిప్ ప్లాన్ చేసేలా కొత్త ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది.హైదరాబాద్ నుంచి 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. 5 రాత్రులు, 6 రోజుల పాటు ఉంటుంది. మే 2వ తేదీ నుంచి అందుబాటులో ఉండే ఈ ట్రిప్ లో మున్నార్, అలెప్పీతోపాటు కేరళలోని పలు ప్రాంతాలు కవరవుతాయి.

ఒకటో రోజు: మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణంలో ఉంటారు.
రెండో రోజు: రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి మున్నార్.. హోటల్ కి వచ్చిన తర్వాత సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. ఆ రాత్రి మొత్తం మున్నార్ లోనే గడుపుతారు.
మూడోరోజు : మూడోరోజు ఉదయం ఎర్నాకులం జాతీయ పార్క్ కు వెళ్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యాం, ఎకో పాయింట్ చూస్తారు. ఆరోజు రాత్రి కూడా మున్నార్ లోనే బస చేస్తారు.

 irctc
నాలుగో రోజు : నాలుగోరోజు ఉదయం హోటల్ నుంచి బయలుదేరి అలెప్పీకి వెళతారు. హోటల్ కి వెళ్లిన తర్వాత బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని చూస్తారు. ఆరోజు రాత్రి అలెప్పీలోనే బస ఉంటుంది.
ఐదోరోజు : హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్నాకులం చేరుకుంటారు. ఉదయం 11.20 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
ఆరో రోజు : మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో కేరళ హిల్స్ అండ్ వాటర్స్ ముగుస్తుంది.

కేరళ టూర్ ధరలు...
డబుల్ షేరింగ్ కు రూ.18,740 కాగా, సింగిల్ షేరింగ్ కు రూ.32,230గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,130 తీసుకుంటారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసున్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ ధరలే అమలవుతాయి. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్ లో వసతి, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా కలిపే ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+