బావ కళ్లల్లో ఆనందం కోసం - టార్గెట్ జగన్: బాలయ్య - అరవింద్ "మెగా" ఆపరేషన్..!!

ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టార్గెట్ జగన్ వ్యూహాలు అమలు అవుతున్నాయి. రాజకీయంగానే కాదు.. ఎంటర్ టైన్ మెంట్ తోనూ రాజకీయ అస్త్రాలు సంధిస్తున్నారు. అల్లు అరవింద్ లీడ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫాం లో అన్ స్టాపబుల్ కార్యక్రమంలో నందమూరి బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మొదలైన రెండో సీజన్ తొలి సీజన్ కంటే వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా సెలెబ్రెటేలే కాకుండా ఇందులో పొలిటీషియన్స్ కు అవకాశం ఇస్తున్నారు.

చంద్రబాబుకు తొలి అవకాశం

చంద్రబాబుకు తొలి అవకాశం

అందులో భాగంగా తొలి ఎపిసోడ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్ తో బాలయ్య సరాదా అంశాల్లోనే రాజకీయం జోడించి అటు ఎంటర్ టైన్ మెంట్ ..ఇటు రాజీకయంగానూ ఆసక్తి పెంచారు. ఆ ఎపిసోడ్ ద్వారా 1995 నుంచి చంద్రబాబు పైన కొనసాగున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు సద్వినియోగం చేసుకున్నారు. ఇక, 2024 ఎన్నికల కోసం ఏపీలో రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి. అందులో భాగంగా, టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో అల్లు ఫ్యామిలీ - బాలయ్య మధ్య సత్సంబంధాలు పెరుగుతున్నాయి. తాజాగా అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ కు బాలయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. త్వరలో గీతా ఆర్ట్స్ నుంచి బాలయ్య హీరోగా అల్లు అరవింద్ ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ఏపీ రాజకీయ సమీకరణాలతో

ఏపీ రాజకీయ సమీకరణాలతో


కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్ కు ఏలే అవకాశం ప్రజలు ఇస్తారని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేసారు. పవన్ రాజకీయంగా ఎదగటం కోసమే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు. ఇటు బాలయ్యకు తన బావ చంద్రబాబు ఈ సారి ఎన్నికల్లో సీఎం కావాలనే కోరిక బలంగా ఉంది. అందుకు చంద్రబాబుకు మద్దతుగా పవన్ తోడు అవసరం. ఇద్దరూ కలిస్తే రాజకీయంగా ఎన్నికల్లో జగన్ ను ఓడించవచ్చేనేది పొలిటకల్ గా టీడీపీ - జనసేనలో వినిపిస్తున్న లెక్కలు. దీంతో, చంద్రబాబు కోసం బాలయ్య - చిరంజీవి కోసం అల్లు అరవింద్. ఇటు అల్లు అరవింద్ - బాలయ్య దోస్తీ. సినిమా వ్యాపార పరంగా అల్లు అరవింద్ చాలా లోతుగా ఆలోచించే వ్యక్తిగా పేరుంది. బాలయ్యతో రిలేషన్ ఆయనకు సినిమా ఇండస్ట్రీలో కలిసొచ్చే అంశం.

వినోదం వెనుక రాజకీయం

వినోదం వెనుక రాజకీయం


ఇటు రాజకీయంగా 2024 ఎన్నికల్లో కలిసే బంధంగా సంకేతాలు. దీంతో, ఇప్పుడు ఇదే వేదికగా బాలయ్య తన షో లో చిరంజీవి - పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక షో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కుదరకపోతే, పవన్ తో మాత్రం పక్కా అని చెబుతున్నారు. ఇక.. జగన్ తో విభేదించి తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల ను అన్ స్టాపబుల్ కు పిలిచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వీటి ద్వారా షో రేటింగ్ పెరగటం ఖాయమని అంచనా వేస్తున్నారు. దీంతో, రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో టీడీపీ - జనసేనకు మేలు చేసే అనూహ్య ఇంటర్వ్యూలు..వ్యక్తులు తెర మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఇండ్ట్రీలో జరుగుతున్న ప్రచారం. తాజాగా, సీఎం జగన్ తో రాం గోపాల్ వర్మ భేటీ. ఆ తరువాత వరుస ట్వీట్లు. దీంతో..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త కోణాలు తెర మీదకు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+