పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు భయపడుతున్నారా?

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో తాను సొంతంగా పోటీ చేస్తానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మీడియా వార్తలు చూస్తుంటే అదే విధంగా అనిపిస్తోంది.

గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ మద్దతు కారణంగానే అధికారంలోకి రాగలిగారనేది టిడిపి నాయకులు కూడా అంగీకరించే విషయం. పవన్ కల్యాణ్ మద్దతు వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు పడి బిజెపి, టిడిపి కూటమి గెలిచింది.

పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేస్తే ఆ కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిపోయి తాము ఓడిపోయే ప్రమాదం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా కోస్తాంధ్ర విషయానికి వచ్చినప్పుడు. రాయలసీమ పరిస్థితి చూసినప్పుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ రాజకీయ సమీరణాలు మార్చే అవకాశం పెద్దగా ఉండదు.

Is Chandrababu fearing of Pawan Kalyan statement?

రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బ కొట్టి బలోపేతం కావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన జగన్ పార్టీకి చెందిన శాసనసభ్యులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే 11 మంది శాసనసభ్యులు టిడిపిలో చేరారు.

రాయలసీమలో చంద్రబాబు, వైయస్ జగన్ పార్టీల పోటీని తట్టుకుని పవన్ కల్యాణ్ గంపగుత్తగా సీట్లను సాధించే అవకాశం లేదు. కోస్తాంధ్రలో పవన్ కళ్యాన్ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ, రాయలసీమలో పవన్ కల్యాణ్ పూర్తిగా పాగా వేస్తారని చెప్పడానికి వీలు లేదు. అందువల్ల మూడు పార్టీలు కూడా గణనీయమైన సీట్లను సాధించుకుని ప్రభుత్వ ఏర్పాటుకు బేరసారాలు సాగించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+