కెసిఆర్: కెకె అసంతృప్తితో ఉన్నారా, వివేక్ దార్లో మందా?

అంతేకాకుండా తెలంగాణపై మాట నిలబెట్టుకున్న కాంగ్రెసు పార్టీ విషయంలో కెసిఆర్ తీరు పైన కెకె అసంతృప్తితో ఉన్నారట. తెలంగాణ రాష్ట్ర సమితిలో పలువురు నేతలు కాంగ్రెసు పార్టీతో అంతర్గతంగా పొత్తును కోరుకుంటున్నారట. పెద్దపల్లి ఎంపి జి వివేక్ వంటి వారు పొత్తును కోరుకుంటున్నారట. ఆదే బాటలో వెళ్లాలని హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా యోచిస్తున్నారట.
కె కేశవ రావు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆయన పొత్తుల కోసం కలిశారా లేక పార్టీలో చేరేందుకా అనే చర్చ జోరుగా సాగుతోంది.
మరోవైపు, వివేక్ తండ్రి వెంకటస్వామి (కాకా)తో కాంగ్రెసు పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారట. వివేక్ దారిలోనే పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మందా జగన్నాథంకు, ఆయన కుమారుడికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదంటున్నారు.












Click it and Unblock the Notifications