రోజాతో ఢీలో ట్విస్ట్: ఎమ్మెల్యే అనిత మంత్రి పదవిపై కన్నేశారా?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రి పదవి పైన కన్నేశారా? అంటే అవుననే అంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తాజాగా, శుక్రవారం నాడు వైసిపి ప్రధాన కార్యదర్శి గొల్ల బాబురావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంత్రి పదవిని పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద ఎలాగైనా సానుభూతి సంపాదించడమే లక్ష్యంగా అనిత ఉన్నారన్నారు.

Is MLA Anitha keen on minister post?

తమ పార్టీకి చెందిన మహిళా శాసన సభ్యురాలు రోజా అనని మాటలను ఆపాదించుకున్నారన్నారు. తన కుటుంబానికి ఉన్న సమస్యను మొత్తం దళితుల సమస్యగా చూపుతున్నారన్నారు. ఇప్పటికైనా ఆమె నియోజకవర్గ ప్రజల మేలు కోసం కృషి చేయాలని హితవు పలికారు.

అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు కౌరవులను తలపిస్తోందని, చివరికి విజయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కాగా, ఏపీ బడ్జెట్ సమావేశాల్లో రోజా ఇష్యూ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. అనిత కూడా.. తన పైన రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+