జగన్‌కు రివర్స్: 144సెక్షన్ తెలుసా: యనమల, కెటిఆర్ చాలా నయం: కెఈ
కర్నూలు/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. జగన్‌కు అసలు 144 సెక్షన్ గురించి తెలియదా అని ప్రశ్నించారు.
రాజధాని అమరావతి కోసం రైతులు స్వచ్చంధంగా భూములు ఇస్తే జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతికి రూ.వందల కోట్లు ఖర్చు అవాస్తవమని, ఇప్పటి వరకు కేవలం రూ.9 కోట్లు మాత్రమే విడుదల చేశామని చెప్పారు.
జగన్ కంటే తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్ చాలా నమయమని ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పారు. శుభకార్యానికి పిలిస్తే శత్రువు అయినా వస్తారన్నారు. రాజధాని శంకుస్థాపనకు జగన్ రానని చెప్పడం అవివేకామన్నారు. జగన్ తీరు మార్చుకోకుంటే ప్రజలు క్షమించరన్నారు.

అంతకుముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... జగన్ రాజధాని వేడుకకు రానని చెప్పడం చిన్నపిల్లల మాటల్లా ఉందన్నారు. రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారని చెప్పారు. జగన్ తీరును ఎవరూ హర్షించరని చెప్పారు.
కాగా, ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని తనకు ఆహ్వానం పంపవద్దని జగన్ బహిరంగ లేఖను చంద్రబాబుకు రాసిన విషయం తెలిసిందే. రాజధాని శంకుస్థాపనకు తాను రాలేనంటూ 3 పేజీల లేఖను జగన్ సీఎం చంద్రబాబుకు పంపారు.
రాజధాని ప్రాంతంలో నిషేధాజ్ఞలు ఎందుకు అమలు చేస్తున్నారని లేఖలో ప్రశ్నించారు. గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పును బేఖాతరు చేశారని, కోర్టులు, ప్రజల మనోభావాలు లెక్క చేయని ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాను రాదలచుకోలేదన్నారు. తాను రానని, తనను పిలువవద్దని జగన్ చెప్పడంపై టిడిపి నేతల మాటల దాడితో వైసిపి ఆత్మరక్షణలో పడినట్లయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications