ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో మార్చి నెల నుంచే ఎండలు కాస్తా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 36 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతుంది. మే నెలలో ఎండలు 50 డిగ్రీలకు చేరుకుంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండలు భరించలేక ప్రజలు ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచనలు కూడా చేస్తున్నారంటే ఎండ తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని 107 మండలాల్లో తీవ్ర గాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయని.. రానున్న రోజుల్లో వడగాడ్పులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మూడు రోజులు పాటు చిత్తూరు, పల్నాడు, అనకాపల్లి, విశాక, శ్రీకాకుళం , విజయనగరం, మన్యం జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీనిలో భాగంగానే శనివారమే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచే ఎండ తీవ్రత తగ్గడంతో ప్రజలు కాస్తా ఉపశమనం పొందారు.












Click it and Unblock the Notifications