వైసీపీ ఎంపీల బీజేపీ బాట - చంద్రబాబు ఫార్ములా..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఓడినా కనీస స్థానాలు దక్కించుకోలేదు. టీడీపీ కూటమికి అనూహ్య మెజార్టీ దక్కింది. అటు కేంద్రంలోనూ ఇదే కూటమి భాగస్వామలుగా ఉన్నారు. దీంతో..జగన్ ఏం చేయబోతున్నారు. 2019 ఎన్నికల తరువాత చోటు చేసుకున్న పరిణామాలు జగన్ లో ఆలోచనకు కారణమవుతున్నాయి. దీంతో, నాడు చంద్రబాబు అమలు చేసిన ఫార్ములా ఇప్పుడు జగన్ అమలు చేస్తారనే చర్చ మొదలైంది.

కొత్త రాజకీయం
ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. అటు వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. అటు కేంద్రంలో టీడీపీ కీలకంగా మారుతోంది. ఎన్డీఏ కూటమిలో సంఖ్య పరంగా బీజేపీ తరువాతి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు, నితీశ్ కీలకంగా మారారు. టీడీపీ ఎంపీలు మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా చేరుతున్నారు. ఏపీలో 2014 -19 అధికార సమయంలోనే టీడీపీ నాడు ప్రతిపక్షంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను తమ వైపు ఆకర్షించింది. నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది.

Jagan adopts Chandrababus strategy Switching MPs to BJP in new political landscape

జగన్ ఆలోచన ఏంటి
ఈ సారి సంఖ్య పరంగా మరింత బలహీనంగా ఉన్న వైసీపీని టీడీపీ మరోసారి టార్గెట్ చేసే అవకాశం ఉంది. వైసీపీకి శాసన మండలిలో సంఖ్య బలం ఉంది. వారి పైన టీడీపీ ఫోకస్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, పార్లమెంట్ లో లోక్ సభలో వైసీపీకి నలుగురు, రాజ్యసభలో 11 మంది బలం ఉంది. బీజేపీకి రాజ్యసభలోనూ ఇప్పటి వరకు వైసీపీ మద్దతు లభించింది. ఇప్పుడు టీడీపీ నేరుగా ఎన్డీఏ భాగస్వామి కావటంతో జగన్ నేరుగా మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. అయితే చంద్రబాబు ఇప్పుడు మోదీతో కలిసారు. పదేళ్ల కాలంగా జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయాలను గమనించారు. దీంతో, ఇప్పుడు వైసీపీ గురించి పొలిటికల్ సర్కిల్స లో కొత్త చర్చ మొదలైంది.

ఎంపీల దారి ఎటు
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బలం కోల్పోయిన జగన్ నాడు చంద్రబాబు అమలు చేసిన ఫార్ములాతో ముందుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. 2019లో ఓడిన తరువాత బీజేపీ రాజ్యసభ సభ్యులు ఒక్కరు మినహా మిగిలిన వారు బీజేపీలో విలీనం అయ్యారు. ఇప్పుడు వారే బీజేపీ అభ్యర్దులుగా ఏపీలో గెలిచారు. దీంతో..అదే ఫార్ములా జగన్ అమలు చేసే అకవాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. కానీ, జగన్ ఆ విధంగా నిర్ణయాలు తీసుకోరని...అయితే, వైసీపీ ఎంపీలు వారంతటగా వారే బీజేపీతో టచ్ లోకి వెళ్లే అవకాశాలు మాత్రం ఉంటాయనేది మరో వాదన. దీంతో..జగన్ ఇప్పుడు రాజకీయంగా ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు..పార్టీని ఎలా కాపాడుకుంటారు..ఎలా కోలుకుంటారనేది ఏపీలో ఆసక్తి కర చర్చగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+