వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఉద్యోగులకు జగన్ శుభవార్త-రెండు రోజుల్లో మార్గదర్శకాలు-పండగే పండగ

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై భారీ అంచనాలతో ఓట్లేసిన ఉద్యోగులకు ఇప్పటికే పలు విషయాల్లో నిరాశ ఎదురవుతోంది. దీంతో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఉద్యోగులు సంతోషంలో మునిగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ మేరకు రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వబోతోంది.

ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఇప్పటివరకూ నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిషేధాన్ని సడలిస్తూ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల ఫైల్ పై సీఎం జగన్ సంతకం కూడా చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. దీంతో రెండు రోజుల్లో బదిలీల ప్రక్రియ సాగేందుకు వీలుగా మార్గదర్శకాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

jagan government green signal to general transfers of employees, guidelines in 2 days

రెండు రోజుల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయబోతున్న ప్రభుత్వం.. జూన్ 17 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ఇస్తోంది. దీంతో ఎన్నో ఏళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది శుభవార్త కానుంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి విషయాల్లో నిరాశ పరిచిన నేపథ్యంలో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకున్న బదిలీల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
andhrapradesh government has given nod to employees general transfers today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X