Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సర్కార్ కు రైల్వేశాఖ షాక్-కొత్త పాజెక్టులకు ససేమిరా-పాత వాటికి రాష్ట్రవాటా విడుదలైతేనే...

ఏపీలో వైసీపీ సర్కార్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎన్నడూ లేనంత స్ధాయిలో అప్పులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అభివృద్ధి కుంటుపడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. అదే సమయంలో కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన ప్రాజెక్టులకు తమ వాటాగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడంతో పలు ప్రాజెక్టులు పెండింగ్ లో పడ్డాయి. వీటి గురించి మాట్లాడకుండా కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలతో రైల్వేశాఖ వద్దకు వెళ్లిన వైసీపీ ఎంపీలకు గట్టి షాక్ తగిలింది. పాత వాటికి నిధులు ఇవ్వకుండా కొత్త వాటి ఊసెత్తొద్దంటూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు వారికి స్పష్టం చేశారు.

 ఏపీలో రైల్వే ప్రాజెక్టులు..

ఏపీలో రైల్వే ప్రాజెక్టులు..

దేశవ్యాప్తంగా రైల్వేశాఖ పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రైల్వే ప్రాజెక్టులు కేటాయించి చేపడుతుంటుంది. వీటికి కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన నిధులు విడుదల చేశాక.. రాష్ట్ర వాటా కూడా ఇవ్వాలని కోరుతుంది. సదరు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర వాటా ఇచ్చి సహకరిస్తే సరే సరి లేకపోతే ఆయా ప్రాజెక్టుల్ని ఇక పట్టించుకోవడం మానేస్తుంది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులు ఇచ్చేందుకు కూడా మొగ్గు చూపే అవకాశాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం ఏపీలో సరిగ్గా ఇదే పరిస్దితి నెలకొంది. రాష్ట్రానికి గతంలో కేంద్రం ప్రకటించిన పలు రైల్వే ప్రాజెక్టులకు వైసీపీ సర్కార్ తమ వాటాగా ఇవ్వాల్సిన నిధుల్ని ఇవ్వడం లేదు. దీంతో ఆయా ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది.

 నిధులివ్వక నిలిచిన ప్రాజెక్టులు

నిధులివ్వక నిలిచిన ప్రాజెక్టులు

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం గతంలో పలు ప్రాజెక్టులు కేటాయించింది. వీటికి కేంద్ర వాటా కూడా విడుదలైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయించిన నిధుల్ని మాత్రం సకాలంలో కేటాయించడం లేదు. దీంతో కేంద్రం ఇచ్చిన నిధులు కూడా మురిగిపోయే పరిస్ధితి. కేవలం వెయ్యికోట్లు ఇస్తే పూర్తయ్యే చాలా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా రాష్ట్రం కాలయాపన చేస్తోంది. దీంతో కేంద్రం ప్రకటించిన, నిధులిచ్చిన రైల్వే ప్రాజెక్టులు కూడా ఏపీలో ముందుకు తీసుకెళ్లలేని పరిస్దితి నెలకొంది.

 రైల్వేశాఖ విజ్ఞప్తులు బుట్టదాఖలు

రైల్వేశాఖ విజ్ఞప్తులు బుట్టదాఖలు

కేంద్రం గతంలో ప్రకటించిన పలు ప్రాజెక్టుల పూర్తి కోసం కేంద్ర రైల్వే శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయి. కానీ రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే విషయాన్ని గతంలో పార్లమెంటులోనూ రైల్వేమంత్రి స్పష్టం చేశారు. అయినా వైసీపీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. దక్షిణ మధ్య రైల్వే తరఫున అధికారులు పలుమార్లు ఆయా ప్రాజెక్టుల పూర్తికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం మాత్రం వాటిని బుట్టదాఖలు చేసింది. నిధుల కొరతను కారణంగా చూపి ఆయా ప్రాజెక్టుల్ని పట్టించుకోవడమే మానేసింది. వీటి కోసం పార్లమెంటులో డిమాండ్లు చేయడం కూడా మానేసింది.

 కొత్త ప్రాజెక్టులకు వైసీపీ ఎంపీల వినతులు

కొత్త ప్రాజెక్టులకు వైసీపీ ఎంపీల వినతులు

అయితే స్ధానికంగా పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో నిన్న దక్షిణ మధ్య రైల్వే ఏటా నిర్వహించే ప్రతిపాదనల భేటీకి వైసీపీతో పాటు టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కూడా హాజరయ్యారు. రాష్ట్రానికి పలు కొత్త రైల్వే ప్రాజెక్టులు కేటాయించాలని కోరారు. గతంలో ఎప్పటినుంచో ఉన్న డిమాండ్లను అధికారుల దృష్టికి తెచ్చారు. ఆయా ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేలా రైల్వేశాఖకు, రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు పంపాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంకు సూచించారు. దీంతో ఆయన వాస్తవ పరిస్ధితిని వారికి తేల్చిచెప్పేశారు. దీంతో అవాక్కవడం వారి వంతయింది.

 జగన్ సర్కార్ కు రైల్వేశాఖ షాక్

జగన్ సర్కార్ కు రైల్వేశాఖ షాక్

గతంలో కేంద్రం ప్రకటించిన పాత రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర వాటా ఇచ్చి సహకరించారని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని వైసీపీ సర్కార్.. ఇప్పుడు ఎంపీల ద్వారా కొత్త ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు పంపడంపై అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో నిన్న వైసీపీ ఎంపీలు చేసిన ప్రతిపాదనలపై దక్షిణ మధ్య రైల్వే జీఎం వారి ముందే స్పందించారు. పాత ప్రాజెక్టులకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇస్తే ముందుగా వాటిని పూర్తి చేస్తామని, ఆ తర్వాత కొత్త ప్రాజెక్టుల సంగతి చూద్దామంటూ వారికి సున్నితంగా తేల్చిచెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వైసీపీ ఎంపీలకు గట్టి షాక్ తగిలినట్లయింది. పాత ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రైల్వేశాఖకు కొత్త ప్రాజెక్టులపై ఎలా ప్రతిపాదనలు పంపగలమంటూ ఆయన వైసీపీ ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+