ఓడినా కేంద్రంలో కీలకంగా మారిన జగన్

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మొన్నటి వరకు 151 స్థానాల్లో ఉన్న వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. నాలుగు పార్లమెంట్ స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించగలిగింది. తిరుపతి, రాజంపేట .అరకు, కడప పార్లమెంట్ స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు.

వైసీపీ ఓడిపోవడం..బీజేపీ, టీడీపీ కలిసి ఉండటంతో జగన్ ఇబ్బంది పెడతారని , గతంలో ఉన్న కేసులను మళ్ళీ వెలికి తీస్తారని, అంతా భావిస్తున్నారు.ముఖ్యంగా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు.అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదనిపిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ అరకొర సీట్లతో మాత్రమే అధికారంలోకి రావడమే దీనికి కారణం. దీంతో మిత్రపక్షాల అవసరం చాలానే ఉంది.అలాగే బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల అవసరం కూడా ఉంది.

Jagan has become a key player in the center politics

దీంతో ఇతర పార్టీల పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు బీజేపీకి చాలా అవసరం.వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండడం, టీడీపీకి ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్‌కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది.వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు.దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్‌కు వచ్చిన ముప్పేమి కనిపించడం లేదు.ఎందుకంటే ఇప్పట్లో రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. 2026 జూన్ నెలలకు నాలుగు స్థానాలు రాజ్యసభలో ఖాళీ అవుతాయి. దీంతో వైసీపీ సభ్యుల మద్దతు కేంద్రానికి తప్పనిసరిగా అవసరం అవుతుంది.ఈ లెక్కన చూసుకున్నా, జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉండాల్సిన పరిస్థితి కనిపించబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+