ఎంత బాధ!, తల్లడిల్లిపోతున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చిన జగన్.. కానీ!

ఆ తల్లిదండ్రులను జగన్ ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ.. వారి శోకాన్ని నియంత్రించడం ఎవరివల్ల కాలేదు.

కడప: ఎదిగొచ్చిన కొడుకులను రోడ్డు ప్రమాదాల్లో పోగొట్టుకునే తల్లిదండ్రులది దీన గాథ. పుత్రశోకంతో గుండెలవిసేలా వారు ఏడుస్తుంటే ఎంతటివారైనా చలించిపోవాల్సిందే. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారులను కోల్పోయిన తల్లిదండ్రులను తాజాగా వైసీపీ అధినేత జగన్ కలిశారు.

ఈ సందర్బంగా ఆ తల్లిదండ్రులను జగన్ ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ.. వారి శోకాన్ని నియంత్రించడం ఎవరివల్ల కాలేదు. అయితే బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు చనిపోవడం బాధాకరమన్నారు.

jagan mohan reddy consoles road accident victims families

కాగా, కడప జిల్లా చిన్నకుడాల క్రాస్ రోడ్డు వద్ద గత నెల 26న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడిన ఘటనలో చంద్రమహేష్, శివమోహన్ రెడ్డిలు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి తల్లిదండ్రులకు వీరు ఏకైక కుమారులు కావడంతో పుత్రశోకంతో వారు తల్లడిల్లిపోతున్నారు. ప్రమాద ఘటనకు కారణమైన పాడుబడిన బావులను పూడ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు.

అంబేడ్కర్ బాటలో నడుద్దాం: వైఎస్ జగన్

దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ 126వ జయంతి సందర్బంగా వైఎస్ జగన్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకునేలా అంబేడ్కర్ చూపించిన మార్గంలో మనమంతా నడవాలని జగన్ ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+