జగన్ రిమాండ్ పొడిగింపు: ఎపిఎన్జీవోలపై కోర్టు సీరియస్

ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్‌ల రిమాండును అక్టోబర్ 3వ తేది వరకు పొడిగించింది. జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలు సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.
ఎపిఎన్జీవోలకు హైకోర్టు ప్రశ్న
మరోవైపు ఎపిఎన్జీవోల సమ్మె పిటిషన్ పైన విచారణను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శనివారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఎపిఎన్జీవోలను ఉద్దేశించి సమ్మెను కొనసాగిస్తారా.. విరమించుకుంటారా స్పష్టం చేయాలని ప్రశ్నించింది. సమ్మెతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఉద్యోగులు ప్రజా సేవకులు అని, ప్రజలకు ఇబ్బందులు కలిగితే చర్యలు తీసుకునే అధికారం కోర్టులకు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్యోగులు ప్రజల సేవ కోసమే ఉన్నారని, ప్రజల కోసమే పని చేయాలని హైకోర్టు సూచించింది. ప్రజా సమస్యలపై ఏ వ్యవస్థ స్పందించనప్పుడు చర్యలకు ఆదేశించే అధికారం కోర్టులకు ఉందన్నారు. ఉద్యోగులకు జవాబుదారీతనం, పారదర్శకత తప్పనిసరి అని తెలిపింది.
ఈ సందర్భంగా ఎపిఎన్జీవోల సమ్మె తరఫు న్యాయవాది.. తమ సమ్మె ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని, ప్రజల నుంచి సమ్మెపై ఫిర్యాదులు రావడం లేదని, ప్రజలకు కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యం ఉందని తెలిపారు. తాము చేస్తోంది సమ్మె కాదని హక్కుల కోసం పోరాటమన్నారు.












Click it and Unblock the Notifications