కాంగ్రెస్ ఖతం: బిజెపితో జగన్ సై, రేపే కొత్త సిఎం: డిఎల్
న్యూఢిల్లీ/హైదరాబాద్: పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తే తాము గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకైనా వచ్చే ఎన్నికల అనంతరం మద్దతిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం న్యూఢిల్లీలో అన్నారు.
సమైక్యాంధ్ర కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. బిజెపి బిల్లును వ్యతిరేకిస్తే మోడీకైనా మద్దతిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ ఖతమైపోయినట్లేనని వ్యాఖ్యానించారు.

డిఎల్ సంచలన వ్యాఖ్య
మాజీ మంత్రి, మైదుకూరు శాసన సభ్యులు డిఎల్ రవీంద్రా రెడ్డి సోమవారం కడప జిల్లాలో సంచలన వ్యాఖ్య చేశారు. రేపటిలోగా రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తాడన్నారు.
కొత్త పార్టీ పెట్టినా వెళ్లరు: కొండ్రు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినా కాంగ్రెసు నేతలు ఎవరు ఆ పార్టీలోకి వెళ్లరని మంత్రులు కొండ్రు మురళి, బాలరాజులు ధ్వజమెత్తారు. పార్టీలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ పెట్టాలని చూడటమేమిటన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీడితేప్రజలు ఛీ కొడతారన్నారు. సాయంత్రం జరిగే సమావేశంలో తాము అన్ని అంశాలను చర్చిస్తామని చెప్పారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications