Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో వకీల్ సాబ్‌ రచ్చ-జగన్ వర్సెస్‌ పవన్- టికెట్ల ధరలపై మళ్లీ హైకోర్టుకు సర్కార్‌

ఏపీలో వకీల్‌ సాబ్‌ చిత్రం టికెట్ల ధరలపై రచ్చ రోజురోజుకీ ముదురుతోంది. టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా పెంపుకు సిద్దమైన దియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు జగన్ సర్కార్‌ ఝలక్‌ ఇచ్చింది. టికెట్లు పెంచితే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన బయ్యర్లు.. మూడు రోజుల పాటు పెంపుకు అనుమతి తెచ్చుకున్నారు. అయితే దీనిపైనా ఆగ్రహంగా ఉన్న సర్కారు.. హైకోర్టులో ఇవాళ హౌస్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది.

 వకీల్‌సాబ్‌పై జగన్‌ వర్సెస్‌ పవన్

వకీల్‌సాబ్‌పై జగన్‌ వర్సెస్‌ పవన్

ఏపీలో వకీల్‌సాబ్‌ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో భారీ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకోవాలంటే చిత్ర యూనిట్లు, బయ్యర్లు ప్రభుత్వాన్ని అనుమతి కోరేవారు. అవసరమైతే ప్రభుత్వంతో లాబీయింగ్ చేసుకుని అనుమతులు తెచ్చుకునే వారు. కానీ పవన్ కళ్యాణ్‌ నటించిన రీమేక్‌ చిత్రం వకీల్‌సాబ్‌ విషయంలో మాత్రం ఈసారి అలా జరగలేదు. అటు వకీల్‌ సాబ్‌ చిత్ర నిర్మాతలు, ఇటు ప్రభుత్వం పట్టుదలకు పోవడంతో టికెట్ల పెంపు వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది.

 వకీల్‌సాబ్‌పై ఏపీ సర్కార్ వర్సెస్ హైకోర్టు

వకీల్‌సాబ్‌పై ఏపీ సర్కార్ వర్సెస్ హైకోర్టు

వకీల్‌సాబ్‌ సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలు చేసిన విజ్ఢప్తిని గత నెల 25న హైకోర్టు అంగీకరించింది. అయితే ప్రభుత్వం అంగీకరించకపోవడంతో కాకినాడలో థియేటర్ల యాజమాన్యాలకు స్ధానిక అధికారులు నోటీసులు పంపారు. ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో వారు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు... కాకినాడ జేసీపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వం వర్సెస్‌ హైకోర్టుగా మారిపోయింది.

 మూడు రోజులకు సరేనన్న హైకోర్టు

మూడు రోజులకు సరేనన్న హైకోర్టు

తాజాగా ప్రభుత్వం మొండిపట్టు, థియేటర్ల యాజమాన్యాల వినతుల నేపథ్యంలో హైకోర్టు మూడు రోజుల పాటు టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. నిన్న శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అంటే ఆదివారం వరకూ టికెట్ల ధరల పెంపుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా టికెట్లు పెంచేందుకు సిద్దమయ్యాయి. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోయినా ప్రభుత్వం మాత్రం ఉన్నత స్దాయిలో చర్చించి దీనికి కూడా నో చెప్పాలని నిర్ణయించాయి.

 హైకోర్టులో సవాల్ చేసిన జగన్‌ సర్కార్

హైకోర్టులో సవాల్ చేసిన జగన్‌ సర్కార్

మూడు రోజుల పాటు వకీల్‌ సాబ్‌ సినిమా టికెట్ల ధరల్ని పెంచుకోవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దీంతో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. ఇవాళ ఈ పిటిషన్‌ విచారణకు రానుంది. ఇవాళ శనివారం కావడంతో కోర్టుకు సెలవు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి ఇంటి నుంచే ఈ పిటిషన్‌ను విచారించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం రాజకీయంగా రచ్చ జరుగుతున్నా ఎట్టి పరిస్దితుల్లోనూ వకీల్‌సాబ్‌ టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెబుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+