ఇంతలోనే అంత మార్పా...జగన్‌పై మాట మార్చిన అశ్వినీదత్

నిర్మాత అశ్వినీదత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అశ్వినీదత్ టీడీపీ కూటమికి బహిరంగంగానే తన మద్దతు ప్రకటించారు. అంతే ఎన్నికల తర్వాత టీడీపీ 161 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ముందే చెప్పడం జరిగింది.ఎన్నికల ఫలితాలు ఆయన చెప్పినట్టుగానే వచ్చాయి. 164 సీట్లలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. అశ్వినీదత్ మొదటి నుంచి కూడా జగన్ ఓడిపోవాలనే చూశారు.

జగన్ ఓడిపోవడంతో ఇండస్ట్రీలో అత్యంత హ్యాపీగా ఫీల్ అయిన వ్యక్తి కూడా ఆయనే. అయితే తాజాగా ఆయన జగన్‌పై మాట మార్చారు.ఇటీవల మీడియాతో మాట్లాడిన అశ్వినీదత్ .. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కల్కి లాంటి భారీ బడ్జెట్ మూవీ విడుదల పెట్టుకుని జగన్ మీద ఎలా విమర్శలు చేశారని , అశ్వినీదత్‌ను ప్రశ్నించారు.

Jagan was friendly with me producer Ashwini Dutt

దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. జగన్‌పై నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. జగన్‌తో నాకు నేరుగానే పరిచియం ఉందని, ఆయన మా చిన్న కూతురు వివాహానికి కూడా వచ్చారని అశ్వినీదత్ గుర్తు చేసుకున్నారు. కల్కి సినిమా విషయంలో తాను ఎప్పుడు డిఫ్రర్ కాలేదని, నాతో జగన్ ఫ్రెండ్లీగానే ఉండేవారని , నాకు ఆయన వల్ల ఎప్పుడు ఇబ్బంది కలగలేదని వ్యాఖ్యానించారు.

అయితే జగన్ సీఎంగా ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమకు ఏ విధమైనటువంటి మేలు చేయలేదన్న కారణంతో ఆయనపై అశ్వినీదత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక జగన్ ఓటమిపై కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ సైతం స్పందించారు. ఒకవేళ ఏపీలో జగన్ తిరిగి విజయం సాధించి ఉంటే .. అప్పుడు టిక్కెట్ రేట్లు పెరిగేవి కాదు కదా..అప్పుడు మీ పరిస్థితి ఏంటనే ప్రశ్న నాగ్ అశ్విన్‌కు ఎదురైంది. అలా జరగలేదు కాబట్టే ఫుల్ హ్యాపీగా ఉన్నామని నాగ్ అశ్విన్‌ సమాధానం ఇచ్చారు. జగన్ పార్టీ ఓడిపోవటం వల్లే తమకు ఈ బెనిఫిట్ వచ్చి హ్యాపీగా ఉన్నామని మొహమాటం లేకుండా ఒక్క మాటలో చెప్పేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+