Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ కీలక నిర్ణయం - ఇక నేరుగా ప్రజలతో, ముహూర్తం ఫిక్స్..!!

ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉండాలే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి నేరుగా ఫిర్యాదులు..సలహాలు తెలియచేసేలా విధి విధానాలు రూపొందిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా వ్యవహరిస్తుంది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని జగనగన్నకు చెబుదాం పేరుతో మే 9న ప్రారంభించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు.

మే 9న జగనన్నకు చెబుదాం : మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీనికోసం 1902 హెల్ప్‌లైన్‌ నంబర్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని సీఎం అన్నారు. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం.

ysjagan

స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశంగా పేర్కొన్నారు. హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేస్తే.. దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాల‌ని సీఎం సూచించారు.

సీఎంఓ పర్యవేక్షణ : జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షా నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం, నాడు-నేడుపై సీఎం సమీక్షించారు. గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలన్నారు. హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్‌ వస్తాయని చెప్పారు. వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలని నిర్దేశించారు.

గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ ను రిజిస్టర్ చేయటం, విచారించటం, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయటం జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలుగా నిర్ణయించారు. ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్‌ అప్‌డేట్స్ అందేలా ఏర్పాట్లు చేసారు.

ysjagan

నిరంతరం మానిటరింగ్ : ఇదే హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పించనున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయని అధికారులు వివరించారు

. ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులుప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు. చీఫ్‌సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారు. ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుందని సీఎం ప్రకటించారు. సమర్థవంతంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+