VV Lakshminarayana: జగన్ పాలసీపై ఎక్స్ లో చర్చ పెట్టిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ ?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జై భారత్ నేషనల్ పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విద్యావంతుల్ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పటికే యాక్టివ్ గా ఉంటున్న ఆయన..పలు అంశాలపై చర్చలు పెడుతుంటారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు నేడు ద్వారా స్కూళ్లకు మరమ్మత్తులు చేయించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడాన్ని స్వాగతించిన వీవీ లక్ష్మీనారాయణ ఇప్పుడు మరో అంశంపై సోషల్ మీడియాలో చర్చ పెట్టారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన హామీల్లో దశల వారీ మద్య నిషేధం కూడా ఒకటి. రాష్ట్రంలో తమకు అధికారం ఇస్తే దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వైసీపీ సర్కార్ ఆరంభంలో కొన్ని చర్యలు తీసుకున్నా ఆ తర్వాత మాత్రం ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని పక్కనబెట్టేసింది. ఈ నేపథ్యంలో మద్య నిషేధం హామీ అమలు చేయడం లేదంటూ విపక్షాలు తరచూ వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. అదే సమయంలో వీవీ లక్ష్మీనారాయణ ఇప్పుడు జగన్ సర్కార్ పేరెత్తకుండానే ఎక్సైజ్ పాలసీపై ఎక్స్ లో చర్చ పెట్టారు.

jai bharat national party chief vv lakshminaryana ask for suggestions on ys jagans liquor policy

ఏపీలో ఎక్సైజ్ పాలసీ, మద్య నిషేధంపై సలహాలు ఇవ్వాలంటూ జై భారత్ నేషనల్ పార్టీ కోరుతోందంటూ వీవీ లక్ష్మీనారాయణ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన.. కీలకమైన ఎక్సైజ్ పాలసీ, మద్య నిషేధం అమలుపై సలహాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు కష్టమని, అలా చేస్తే ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని లాక్కుంటాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వం అమలు చేయాల్సిందేనంటున్నారు.

అయితే వీవీ లక్ష్మీనారాయణ ఎక్సైజ్ పాలసీ, మద్య నిషేధంపై జనం అభిప్రాయాలు కోరుతున్నా తమ పార్టీ అభిప్రాయం మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. జనం నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయాల ఆధారంగా జై భారత్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో దీనిపై ఏదైనా హామీ ఇచ్చే అవకాశం ఉండొచ్చంటున్నారు. కానీ ఎన్నికల వేళ జగన్ సర్కార్ విఫలమైన ఓ హామీపై చర్చ పెట్టడం ద్వారా ప్రభుత్వాన్ని సీబీఐ మాజీ ఇరుకునపెడుతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+