మెదక్ నుంచి జైపాల్ రెడ్డి పోటీ: అధిష్టానం యోచన

Jaipal Reddy
న్యూఢిల్లీ: మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని పోటీకి దింపే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని బలమైన అభ్యర్థిని పోటీకి దింపాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. జైపాల్ రెడ్డితోనూ ఇతర నాయకులతోనూ చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తోదంి.

గజ్వెల్ శాసనసభా స్థానాన్ని ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మెదక్ లోకసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మెదక్ లోకసభ స్థానం ఖాళీ అయి, ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మెదక్ లోకసభ సీటు కోసం మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి, మాజీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ తదితర నేతలు పోటీ పడుతున్నారు.

ఇదిలావుంటే, పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. వ్యక్తిగత పనులపై వచ్చిన ఆయనను తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రోటోకాల్ విభాగం నేత వేణుగోపాల్ తదితర నేతలు కలిశారు.

కాగా, సోదరుని మరణంతో విషాదంలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కాంగ్రెసు నాయకులు కుంతియా, పొన్నాల లక్ష్మయ్య కలిసి పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+