సీఎం జగన్ దగ్గరకు వెళ్ళిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణం: జక్కంపూడి రాజా సంచలనం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో పార్టీ ఘోర పరాజయం పాలయింది. . వైసిపి దారుణ ఓటమికి దారి తీసిన పరిస్థితులపై ప్రస్తుతం ఏపీలోని వైసీపీ నేతలు సమీక్ష చేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది. ఇంత దారుణంగా వైసిపి ఓడిపోవడానికి గల కారణమేమిటి అనే ఆత్మపరిశీలనలో పడ్డారు. ఇక తాజాగా ఎన్నికల్లో ఓటమిపై జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఓటమిపై జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు
రాజనగరం మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా నేడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎంతో చేశామని, అయినా ఎందుకు ఓడిపోయాం అన్నది ఎవరికీ అంతు చిక్కడంలేదని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు వైయస్ జగన్ చుట్టూ పనికిమాలిన అధికారులు, చెత్త కోటరీ ఉందంటూ జక్కంపూడి రాజా తీవ్రవ్యాఖ్యలు చేశారు. అబద్ధం చెప్పకూడదు రాజకీయాలలో నిజాయితీగా ఉండాలనే జగన్ తీరులో నిజంగా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారేమో అంటూ రాజా వ్యాఖ్యలు చేశారు.

జగన్ చుట్టూ కోటరీ
జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను ఊహల్లో ఉంచారని, ధనుంజయ్ రెడ్డి లాంటి చెత్త అధికారి ఆయన్ని సీఎంల వ్యవహరించేవాడని జక్కంపూడి రాజా మండిపడ్డారు. జగన్ కు ఏ విషయం చెప్పాలి అన్న, ఫైల్ ఇవ్వాలి అన్న ధనుంజయ్ రెడ్డి రూమ్ బయట ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడేలా వ్యవహరించేవాడని రాజా సంచలన ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యేలు జగన్ తో మాట్లాడే అవకాశం ఇవ్వరు
ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ పట్టుకొని ఎవరన్నా MLA వెళ్తే పొద్దున్న నుంచి రాత్రి వరకు గేటు బయట నిల్చోపెట్టేవాళ్ళు అంటూ జక్కంపూడి రాజా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ధనుంజయ రెడ్డి ఎమ్మెల్యేలు లోపలికి వెళితే కనీసం రెండు నిమిషాలు కూడా మాట్లాడడానికి తీరిక లేనట్టు వ్యవహరించేవాడని షాకింగ్ విషయాలను వెల్లడించారు.
జగన్ ఐ పాక్ ఆఫీస్ కి వెళ్లి చేసిన వ్యాఖ్యల కారణం ఇదే
ఎన్నికల తర్వాత కూడా జగన్ ఐ పాక్ ఆఫీస్ కి వెళ్లి ప్రపంచమంతా మన వైపు చూడబోతుంది అన్నారంటే... ఆయన ఎంత భ్రమలో ఉన్నారు.. ఆయన్ని ఎంత భ్రమలో ఉంచారో అంటూ జగన్ చుట్టూ ఉండే కోటరీ పైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జగన్ చుట్టూ ఉన్న కోటరీ,కొంతమంది పనికిమాలిన అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారని, జగన్ ను తప్పుదోవ పట్టించారని జక్కంపూడి రాజా ఆరోపించారు.
జగన్ ను ఊహలలో ఉంచారు.. ఫలితమే ఇది
జగన్ కు ఏదైనా చెబితే ఆయన ధనుంజయ రెడ్డికి చెప్పేవారని, ఇక ధనుంజయ రెడ్డి చేతిలోకి ఫైల్ వెళ్లినా పని జరగదని, అంతే సంగతి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ పార్టీ ఓటమి పాలు కావడానికి వాస్తవాలు తెలియకుండా జగన్ ను భ్రమలో ఉంచిన కోటరీ నే కారణమని జక్కంపూడి రాజా ఆరోపించారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications