మీరు అలా చిచ్చు పెట్టొచ్చా, తిరుగుబాటు: బీజేపీపై పవన్ కళ్యాణ్ తీవ్రవ్యాఖ్య
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు బీజేపీ పైన తీవ్రంగా మండిపడ్డారు. ఉత్తరాది - దక్షిణాది అంటూ విభజన రాజకీయం చేయవద్దన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు బీజేపీ పైన తీవ్రంగా మండిపడ్డారు. ఉత్తరాది - దక్షిణాది అంటూ విభజన రాజకీయం చేయవద్దన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు కౌంటర్ ఇచ్చారు.
మతాల ఆధారంగా విభజిస్తే పరవాలేదా అని నిలదీశారు. తద్వారా నేను దక్షిణాది - ఉత్తరాది అని మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయన్నారు. తెలివితేటలు కేవలం నార్త్ బ్లాక్‌లో ఉన్న వారికే పరిమితం కాదన్నారు.
వైసిపితో పాటు ఏ పార్టీతోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో తనకు బీజేపీ మాత్రమే ఛాయిస్‌గా ఉందని, కాబట్టి బీజేపీకి ఓటేయమని చెప్పానని, హామీలు నెరవేర్చకుంటే నిలదీస్తానని కూడా చెప్పానని గుర్తు చేశారు.
త్వరలో ఈశాన్య రాష్ట్రాలకు కూడా హోదా ఉండదన్న బీజేపీ వ్యాఖ్యల పైన కూడా పవన్ స్పందించారు. హోదా పోయినా, ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు హోదా గురించి తెలుసుకున్నానని చెప్పారు.
మొండివాళ్లు రాజుకైనా బలవంతులు అన్నట్లుగా మన నేతల వైఖరి ఉందని విమర్శించారు. వారు మొండితనం చూపిస్తే ప్రజలు చూపిస్తారన్నారు. వాళ్లు తెచ్చిన చట్టాలనే పాటించరా అని నిలదీశారు. తెలంగాణ అంశాన్ని 17 ఏళ్లు నాన్చి, కేవలం 12 గంటల్లో తేల్చేశారన్నారు. హోదా ఇవ్వననడం దేనికి నిదర్శనం అన్నారు. తాను లెఫ్ట్ కాదు.. రైట్ కాదని.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు.
{photo-feature}
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications