వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రెడ్డి ఆ బాలిక హత్య కేసును ఎందుకు తవ్వడం లేదు.. నిందితులను రక్షిస్తున్నారా? పవన్ కల్యాణ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

రైతుల సమస్యను పరిష్కరించడానికి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాయలసీమ పర్యటనలో భాగంగా రైల్వే కోడూరులో ఆదివారం రాత్రి మాట్లాడుతూ.. మహిళలపై లైంగిక దాడులు చూసిన నిందితులకు నేతలు అండగా నిలుస్తే సహించేలేదని స్పష్టం చేశారు. అలాగే రైతుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వాల ఒత్తిడి తెస్తామని చెప్పారు. ప్రతీకార చర్యతో జనసేన నేతలపై దాడుల చేయడంపై పవన్ కల్యాణ్ ఆందోళ వ్యక్తం చేశాడు. కడపలోని రైల్వే కోడూరులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..

జన సైనికులపై దాడులు

జన సైనికులపై దాడులు

జనసైనికులపై దాడుల చేయడం పిరికి పంద చర్య. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని అలాంటి దాడులను సమర్ధంగా అడ్డుకొంటామని పవన్ కల్యాణ్ అన్నారు. మహిళ భద్రత కోసం, చిన్నకారు రైతులు, మధ్య తరగతి రైతులకు న్యాయం జరిగే వారకు జనసేన పార్టీ పోరాటం సాగిస్తుందని అన్నారు. పసుపు, ఉల్లిగడ్డ, టమాటా గిట్టుబాటు ధర గురించి రైతులు తనతో మొరపెట్టుకొంటున్నారనే విషయాన్ని వెల్లడించారు.

పసుపు బోర్డు ఏర్పాటుపై

పసుపు బోర్డు ఏర్పాటుపై

గతంలో ఓ ఎన్నికల్లో నిజమాబాద్ సభలో మోడీతో కలిసి పాల్గొన్నాను. ఆ సందర్భంగా మోడీని నిజమాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అడిగాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత అక్కడ నుంచి గెలిచిన ఎంపీ పసుపు బోర్డు ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. దాంతో నిజమాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కాలేకపోయిందనే విషయాన్ని తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

2017 ఘటనపై పవన్ కల్యాణ్ సీరియస్

2017 ఘటనపై పవన్ కల్యాణ్ సీరియస్

రాయలసీమ పర్యటన కోసం రేణిగుంట విమానాశ్రయంలో అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున్న అమ్మాయిలు తనను కలిశారు. బాలికలకు, అమ్మాయిలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ హత్య తనను కంటతడి పెట్టించింది. అలాగే 2017లో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని మరణంపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు.

ఆ కేసును ఎందుకు తవ్వడం లేదు

ఆ కేసును ఎందుకు తవ్వడం లేదు

కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల విద్యార్థిని హత్య ఘటనకు సంబంధించిన కేసును సీఎం జగన్ రెడ్డి మళ్లీ ఎందుకు బయటకు తీయడం లేదు. నిందితులను ఎందుకు రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు? వారికి పిల్లలు లేరా? రాజకీయ నేతలకు అమ్మాయిలు లేరా? ఇలాంటి సంఘటనలు ప్రశ్నించే వారే లేరా? అని పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు.

కూతురు కోసం లాయర్ అవతారం

కూతురు కోసం లాయర్ అవతారం

తన కూతురుకు జరిగిన అన్యాయానికి న్యాయ పోరాటం చేయడానికి ఏకంగా బాధితురాలి తల్లి లాయర్‌గా అవతారం ఎత్తాల్సి వచ్చింది. తన కూతురి కేసును తల్లి వాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృగాళ్ల చేతిలో బలైపోతున్న అమ్మాయిలు, బాధితుల గురించి మాట్లాడమని ఆ తల్లి కోరింది. కట్టమంచి రామలింగారెడ్డి ఘటన గానీ, తాజా హైదరాబాద్ సంఘటన లాంటి వాటికి అంతం పలకాలంటే కఠినమైన చట్టాలని రూపొందించాల్సిందే అని పవన్ కల్యాణ్ అన్నారు.

English summary
As Part of Rayalaseema tour, Jana Sena chief Pawan kalyan met Farmers in Railway kodur. He said, will write a letter to Prime Minister on farmer Issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X