తెనాలి ఆసుపత్రి: పీపీఈ కిట్లు లేక..రెయిన్ కోట్లతో పేషెంట్లకు వైద్యం: ఆపదలో వారియర్స్: జనసేన
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తోన్న నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు ప్రభుత్వం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్లను అందజేయలేకపోతోందని జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పీపీఈ కిట్లు లేకపోవడం వల్ల ఫ్రంట్‌లైన్ వారియర్లు రెయిన్ కోట్లను ధరించి.. పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఫలితంగా- వారంతా ఆపదలో చిక్కుకుంటున్నారని చెప్పారు.
తెనాలి ఆసుపత్రిలో నెలకొన్న తాజా పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో రోజూ వేల కొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రంట్‌లైన్ వారియర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 88 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాల్సి ఉందని అన్నారు.

ప్రాణాలకు తెగించి వైద్య సేవలను అందిస్తోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు అవసరమైన రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. పీపీఈ కిట్లు లేక రెయిన్ కోట్లను ధరించి తెనాలి ఆసుపత్రిలో ఫ్రంట్‌లైన్ వారియర్లు పని చేస్తున్నారని చెప్పారు. గ్లౌజులు, శానిటైజర్లను సొంత డబ్బులతో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ కూడా లేరని నాదెండ్ల మనోహర్ అన్నారు.
Recommended Video
200 పడకల సామర్థ్యం ఉన్న తెనాలి ఆసుపత్రిలో చాలినంత మంది డాక్టర్లు, నర్సులు లేకపోవడం వల్ల ఉన్నవారిపై పని ఒత్తిడి పెరుగుతోందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఫలితంగా- పేషెంట్లకు నాణ్యమైన వైద్య సహాయం అందకపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఫ్రంట్‌లైన్ వారియర్లకు అవసరమైన పీపీఈ కిట్లను అందజేయాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఓ జర్నలిస్ట్, తిరుపతిలో టీటీడీ ఉద్యోగి ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయారని అన్నారు. వెంటనే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లోనూ హౌస్ సర్జన్లకు స్టైపెండ్ చెల్లించకపోవడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications