అప్పుడే ఓటీటీలోకి 'పెద్ది'..? ఎందులో చూడాలంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో వచ్చిన 'పెద్ది' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య జూన్ 4 న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకూ రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆత్మగౌరవం, క్రీడా స్ఫూర్తి, భావోద్వేగాలు తదితర అంశాలను సమర్థవంతంగా ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే రామ్ చరణ్ నటన ఈ సినిమా విజయానికి మేజర్ ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు తన నటవిశ్వరూపాన్ని రామ్ చరణ్ స్క్రీన్ పై ప్రదర్శించారు.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో జూన్ 23న హైదరాబాద్ లోని శిల్పకలావేదికలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించనుంది చిత్ర యూనిట్. అభిమానుల సమక్షంలో నిర్వహించనున్న ఈ వేడుకకు పెద్ది చిత్ర బృందం మొత్తం హాజరుకానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరోవైపు పెద్ది మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే నెట్‌ ఫ్లిక్స్ ద‌క్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జూలై 2 న పెద్ది మూవీ ఓటీటీలో విడుద‌ల కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అతిత్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. తొలుత జూలై నెలాఖ‌రున ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నెట్‌ ఫ్లిక్స్ భావించింద‌ట‌. కానీ పలు కారణాలతో దాదాపు రెండు మూడు వారాల ముందే ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు స్పష్టం అవుతోంది.

RamCharan Peddi to OTT in One Month Fans Buzz Over Possible Early Streaming Date RamCharan Peddi

ఇక పెద్ది మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించింది. అలాగే జగపతిబాబు, శివరాజ్‌ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమా బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+