Viral Video: రష్మిక కోసం విజయ్ దేవరకొండ సీక్రెట్ విష్!
Viral Video: హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం కోసం బోనం సమర్పించడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే తరలిరావడంతో నగరంలోని పలు ఆలయాల వద్ద భారీ జనసందోహం కనిపిస్తోంది. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. నటి నిహారిక కొణిదెల బంగారు బోనం సమర్పించిన తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ , ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు.
ఆ ముగ్గురూ బోనాల పండుగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విజయ్ దేవరకొండ లాల్ దర్వాజ ఆలయానికి వచ్చారని తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో అభిమానులు, భక్తులు అక్కడికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన విజయ్ దేవరకొండతో ఫోటోలు, వీడియోలు దిగేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహం చూపించారు. అనంతరం జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడిన విజయ్ దేవరకొండ.. తాను లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు.

ఆయన తన భార్య రష్మిక మందన్న కోలుకోవాలని, ఆమె క్షేమంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక పూజలు కూడా చేశారు ."మేము మొదటిసారి మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నాం. మా సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్ హౌస్‌కి కూడా భద్రకాళి పేరు పెట్టారు. అమ్మవారు మీ కోరికలన్నీ తీర్చాలని ప్రార్థిస్తున్నాను" అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఆలయంలోని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లో బోనాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న ప్రధాన వేడుకలలో ఒకటి. ముఖ్యంగా ఈ పండుగ సమయంలో లాల్ దర్వాజా ఆలయాన్ని వేలాది మంది భక్తులు తరలివస్తారు. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కలిసి ఆలయాన్ని సందర్శించడం, దానికి తోడు రష్మిక కోసం విజయ్ ప్రత్యేకంగా ప్రార్థించడం ఈ ఏడాది బోనాలు వేడుకలకు ఓ ఆసక్తికరంగా నిలిచింది.
Vijay Deverakonda, filmmaker Sandeep Reddy Vanga and actor Anand Deverakonda visited Hyderabad's historic #LalDarwazaMahankaliTemple to seek Goddess Mahankali's blessings on the auspicious occasion of Bonalu. #VijayDeverakonda #SandeepReddyVanga #AnandDeverakonda #Bonalu pic.twitter.com/Z6jXlZk2M5
— Hyderabad Times (@HydTimes) August 9, 2026




Click it and Unblock the Notifications