కియారా ఇంటిమేట్ సీన్స్‌పై ట్రోలింగ్.. భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఏమన్నాడంటే!
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ సినిమా ట్రైలర్, ఓ పాట ఇటీవల విడుదలైన అనంతరం అందులో హీరోయిన్ కియారా అద్వానీ నటన, ముఖ్యంగా యష్‌తో ఉన్న ఇంటిమేట్ సీన్లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ట్రోలింగ్ కు గురవుతున్న కియారా అద్వానీకి ఆమె భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తోడుగా నిలిచారు. ఈ సినిమాలో కియారా నటనను, వృత్తిపట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసిస్తూ సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సిద్ధార్థ్ మల్హోత్రాన తన ఇన్‌స్టా స్టోరీలలో 'టాక్సిక్ ' ట్రైలర్ పై స్పందిస్తూ.. " ఈ సినిమా కోసం కియారా అద్వానీ పడిన శ్రమ, పట్టుదల, అభిరుచి అన్నీ వెండితెరపై స్పష్టంగా కనిపిచబోతున్నాయి. ఇది నీ కెరీర్లోనే అత్యుత్తమ సినిమాలలో ఒకటి కాబోతోంది కి!!" అని సిద్ధార్థ్ మల్హోత్రా రాసుకొచ్చారు. అంతే కాకుండా దర్శకురాలు గీతూ మోహన్ దాస్, హీరో యష్ సహా చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆగస్టు 26న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.

'తబాహి' పాటలో తన నటనపై కియారా ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్ పెట్టారు . ఈ పాటలో కియారా, యష్‌ల మధ్య సన్నిహిత సన్నివేశాలు ఉన్నాయి, ఇవి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలను రేకెత్తించాయి. ఇదిలా ఉండగా, శనివారం బెంగళూరులో జరిగిన 'టాక్సిక్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో యష్ కూడా కియారాకు మద్దతుగా నిలిచారు . ఆ పాత్ర పట్ల ఆమె నిబద్ధతను ప్రశంసించిన ఆయన, తరచుగా ఎదురయ్యే ప్రతికూలతలను పట్టించుకోవద్దని ఆమెకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కియారాను ఉద్దేశించి యష్ మాట్లాడుతూ, "కియారా ఇందులో నువ్వు పోషించిన పాత్రకు నువ్వు చాలా అంకితభావంతో ఉన్నావు. మొదట్లో ఇంతమంది నటీనటులను తీసుకురావడం ఓ సమస్య అవుతుందని మేమందరం అనుకున్నాం, కానీ కియారా చాలా ఒదిగి ఉండే వ్యక్తి. ఒక నటిగా మీరు ఎదుర్కోవలసి వచ్చే వాటిని పట్టించుకోవద్దు. మీరు దేనిని నమ్ముతారో దానిని చేయండి, ప్రజలు దానిని ఆదరిస్తారు, అభినందిస్తారు. మనం కాలానికి కొంచెం ముందున్నాం అంతే." అంటూ యష్ వెల్లడించారు.
'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇందులో యష్, కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.




Click it and Unblock the Notifications