ఇంతింత బండరాళ్లు నా కారుపై విసిరేశారు: నా తల పగిలిపోయేది: మమత బెనర్జీ ఆందోళన

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడి చోటు చేసుకుంది. ఉత్తర 24 పరగణాల జిల్లా హలీసహర్‌లో ఈ మధ్యాహ్నం ఈ ఘటన సంభవించింది. పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చడానికి ఆమె కారులో వెళ్తోండగా.. బీజేపీ కార్యకర్తలు, స్థానికులు ఆమె వాహనాన్ని చుట్టుముట్టారు. మమత బెనర్జీ ప్రయాణిస్తోన్న కారుపై బురద చల్లారు. రాళ్లు, ఖాళీ బాటిల్స్, చెప్పులు విసిరివేశారు.

ఈ హఠాత్పరిణామంతో హలీసహర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కస్టడీ మరణంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న స్థానికులు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతోండటంతో పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటన తర్వాత హలీసహర్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

They Could Have Killed Us Mamata Banerjee Details Stones Thrown at Her Car in Barrackpore West Bengal

ఇటీవల తృణమూల్ కార్యకర్త ఒకరు పోలీసుల కస్టడీలో మరణించాడు. పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే అతను చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తోన్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ మధ్యాహ్నం మమత బెనర్జీ కోల్ కత నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె కాన్వాయ్ హలీసహర్ లో ప్రవేశించగానే వందలాది మంది స్థానికులు రోడ్డుపైకి వచ్చారు. కాన్వాయ్ కు అడ్డుగా నిలిచారు. వాహనాలు ముందుకు వెళ్లకుండా దిగ్బంధించారు. మమతా బెనర్జీ కారుపై బురద చల్లారు. చెప్పులను విసిరివేశారు.

మమత బెనర్జీకి మరో సడన్ షాకిచ్చిన సీఎం సువేందు: 100 రోజుల పాలన నాడు.. !!
మమత బెనర్జీకి మరో సడన్ షాకిచ్చిన సీఎం సువేందు: 100 రోజుల పాలన నాడు.. !!

ఆ సమయంలో మమత బెనర్జీ కారులోనే ఉన్నారు. ఈ దాడిపై మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కళ్ల ముందే కొందరు సంఘవిద్రోహ శక్తులు తన కారుపైకి పెద్ద పెద్ద బండరాళ్లను విసిరారని ఆరోపించారు. ఒకవేళ కారు కిటికీ అద్దాలు తెరిచి ఉంటే.. ఆ రాళ్లు తనకు తగిలేవని, తల పగిలిపోయేదని అన్నారు. ఈ దాడిలో తనతో పాటు పార్టీ నాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని వాపోయారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

విశాఖలో AAA Cinemas గ్రాండ్ ఇనాగ్యురేషన్: రాకా పై అద్దిరిపోయే అప్ డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
విశాఖలో AAA Cinemas గ్రాండ్ ఇనాగ్యురేషన్: రాకా పై అద్దిరిపోయే అప్ డేట్ ఇచ్చిన అల్లు అర్జున్

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయనడానికి ఈ దాడే నిలువెత్తు నిదర్శనంగా మమతా బెనర్జీ అభివర్ణించారు. స్థానిక పోలీసులు చోద్యం చూస్తూ గడిపారంటూ మండిపడ్డారు. వారి పనితీరును తప్పుబట్టారు. నిరసన జరుగుతున్న సమయంలో పోలీసులు మూగప్రేక్షకుల్లా నిలబడ్డారని, బీజేపీ నాయకులకు రక్షణ కల్పించడంలో చూపిస్తోన్న శ్రద్ధ ప్రతిపక్ష పార్టీ నేతాలకు చూపట్లేదంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోన్నదో కూడా అర్థం కావట్లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+